ఎవరీ నీల్ మోహన్, యూట్యూబ్ కొత్త సీఈవోకు భారత దేశానికి ఉన్న కనెక్షన్ ఇదే..

Published : Feb 17, 2023, 04:54 PM IST
ఎవరీ నీల్ మోహన్, యూట్యూబ్ కొత్త సీఈవోకు భారత దేశానికి ఉన్న కనెక్షన్ ఇదే..

సారాంశం

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ సీఈవోగా భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి నీల్ మోహన్ నియమితులు అయ్యారు. ఇప్పటికే, గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈవోలుగా భారతీయ మూాలాలు ఉన్న వ్యక్తులు నేతృత్వం వహిస్తున్న నేపథ్యంలో నీల్ మోహన్ యూట్యూబ్ సీఈవోగా నియమితులు అవ్వడం  భారతీయులకు గర్వకారణంగా మారింది. 

Who is Neal Mohan: సుందర్ పిచాయ్,  సత్య నాదెళ్ల,  పరాగ్ అగర్వాల్, ఇంద్ర నూయి, శంతనూ నారాయణ భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు ఇప్పటికే పలు మల్టీ నేషనల్ ఐటి రంగ సంస్థలకు  సీఈవోలు గాను ఇతర ఉన్నత పదవుల్లో చలామణి అవుతున్నారు.  ఇప్పుడు అదే కోవలో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ యాప్ ప్లాట్ఫారం అయినటువంటి యూట్యూబ్ సీఈవోగా నీల్ మోహన్ అనే భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తిని సీఈవోగా నియమించారు.  దీంతో మరోసారి భారతీయుల సత్తా ప్రపంచానికి చాటినట్లు అయింది.  ఈ నేపథ్యంలో నెటిజన్లు  నీల్ మోహన్ బ్యాక్ గ్రౌండ్ గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు.  భారతీయ మూలాలు ఉన్న నీల్ మోహన్ గురించి  పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

ఐటీ రంగంలో భారతీయుల సత్తా ప్రపంచమంతటా విస్తరిస్తోంది. అతిపెద్ద టెక్ కంపెనీలకు భారతీయ ఇంజనీర్లు నాయకత్వం వహిస్తున్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్,IBM ఇలా భారతీయ సంతతికి చెందిన వారు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లుగా ఉన్నారు. ఇప్పుడు ఈ కోవలోకి యూట్యూబ్ పేరు కూడా చేరింది. యూట్యూబ్ నూతన సీఈఓగా నీల్ మోహన్ బాధ్యతలు చేపట్టనున్నారు. పాత సీఈవో సుసాన్ వోజ్కికీ 9 ఏళ్ల ప్రయాణం తర్వాత ఆమె తన పదవికి రాజీనామా చేశారు.

YouTube కొత్త CEO నీల్ మోహన్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..?

నీల్ మోహన్ గత కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్‌తో కలిసి పనిచేస్తున్నారు. ఆయన యూట్యూబ్‌కి చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు.  ఇప్పుడు యూట్యూబ్ సీఈఓ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమయ్యారు.

నీల్ మోహన్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. అతను 2005లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి తన MBA పూర్తి చేశాడు. ఆయన గతంలో DoubleClick Incని అనే సంస్థను స్థాపించారు. అనంతరం తన సంస్థను Googleలో విలీనం చేశారు. నీల్ మోహన్ సృష్టించిన డబుల్ క్లిక్  సంస్థను Google 3.1 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అయితే నీల్ మోహన్ గతంలో మైక్రోసాఫ్ట్‌లో కూడా కొంతకాలం పనిచేశారు. మైక్రోసాఫ్ట్‌లో తన స్వల్ప వ్యవధిలో, అతను జూన్ 2004 నుండి సెప్టెంబర్ 2004 వరకు మేనేజర్, కార్పొరేట్ వ్యూహకర్తగా పనిచేశాడు.
 
నీల్ మోహన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, అతను Stitch Fix , 23 and Me బోర్డ్ ఆఫ్ డైరక్టర్లలో ఒకరిగా ఉన్నారు. 2008లో నీల్ మోహన్ గూగుల్‌లో చేరాడు. మార్చి 2008 నుండి నవంబర్ 2015 వరకు, మోహన్ Googleలో వీడియో ప్రకటనలపై పనిచేశారు. 2015లో నీల్ మోహన్ యూట్యూబ్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. YouTubeలో అనేక పెద్ద ప్రాజెక్ట్‌లకు మోహన్  నాయకత్వం వహించాడు. యూట్యూబ్ టీవీని యూట్యూబ్ మ్యూజిక్, యూట్యూబ్ ప్రీమియం, షార్ట్‌లను ప్రారంభించడంలో నీల్ మోహన్ అతని బృందం కీలకపాత్ర పోషించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Business Ideas : నెలనెలా అక్షరాలా లక్ష ఆదాయం.. డబ్బులు సంపాదించడం ఇంత ఈజీనా..!
Stock Market: రూ.7 లక్షల కోట్లు ఆవిరి.. భారత స్టాక్ మార్కెట్‌ను దెబ్బకొట్టిన 5 కారణాలు ఇవే