రూ.5 లక్షల కోట్ల సంపద ఉన్న ఐపీఎల్ ప్లేయర్.. ఎవరు ఈ ఆర్యమన్ బిర్లా ?

By Ashok kumar Sandra  |  First Published Apr 18, 2024, 12:00 PM IST

 ఆర్యమాన్ బిర్లా  క్రికెట్ ప్లేయర్. అతను అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు కూడా. ఆర్యమాన్ 2017-18 రంజీ ట్రోఫీ సీజన్‌లో మధ్యప్రదేశ్ తరపున ఎంట్రీ  చేశాడు. నవంబర్ 2018లో  తొలి సెంచరీని కూడా సాధించాడు.
 


ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారులలో కొందరు భారతీయ క్రికెటర్లు వుంటారు... దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనీలు ఈ లిస్ట్ లో తప్పకుండా వుంటారు. వీరి మొత్తం సంపద రూ. 1,000 కోట్లకుపైగా ఉంటుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. కానీ వీరికంటే ఓ సాధారణ ఐపిఎల్ ప్లేయర్ సంపద రెట్టింపు వుందనే విషయం తెలుసా... అతడే ఆర్యమాన్ బిర్లా. ఫస్ట్-క్లాస్ క్రికెటర్ల కంటే ఇతడి సంపాదన చాలా తక్కువ.   

 ఆర్యమాన్ బిర్లా  క్రికెట్ ప్లేయర్. అతను అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు కూడా. ఆర్యమాన్ 2017-18 రంజీ ట్రోఫీ సీజన్‌లో మధ్యప్రదేశ్ తరపున ఎంట్రీ  చేశాడు. నవంబర్ 2018లో  తొలి సెంచరీని కూడా సాధించాడు.

Latest Videos

undefined

ఎవరీ ఆర్యమాన్ బిర్లా ?

ఆర్యమాన్ బిర్లా ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్, భారతీయ వ్యాపారవేత్త కుమార మంగళం బిర్లా కుమారుడు. ఆదిత్య బిర్లా గ్రూప్ మొత్తం ఆస్తుల విలువ రూ. 4.95 లక్షల కోట్లు.  ఆదిత్య బిర్లా గ్రూప్‌లో గ్రాసిమ్, హిందాల్కో, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ ఇంకా  ఆదిత్య బిర్లా క్యాపిటల్ వంటి బ్రాండ్‌లు ఉన్నాయి. అలాగే ఈ సంస్థలో 1,40,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్  ఆర్యమాన్ బిర్లాను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. 9 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో ఆర్యమాన్ ఒక సెంచరీ, 1 హాఫ్ సెంచరీతో 414 పరుగులు సాధించాడు. అయితే, 2019 తర్వాత అనారోగ్య కారణాల వల్ల ఆర్యమాన్ క్రికెట్ నుండి బ్రేక్  తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

“నా క్రికెట్ కెరీర్‌లో ఈ స్థాయికి చేరుకోవడానికి కృషి, పట్టుదల, అంకితభావం, అపారమైన ధైర్యమే కారణం. అయితే నేను కొంతకాలంగా తీవ్రమైన ఆందోళనను ఎదుర్కొంటున్నాను, ”అని ఆర్యమాన్ బిర్లా ట్విట్టర్‌ పోస్ట్‌లో రాశారు.

" నేను ఇప్పటివరకు అన్ని బాధల నుండి బయట పడేందుకు ప్రయత్నించారు, కానీ ఇప్పుడు నా మానసిక పరిప్థితి బాగాలేదు...  ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి, నేను క్రికెట్ నుండి  విశ్రాంతిని తీసుకోవాలని నిర్ణయించుకున్నాను.  స్పోర్ట్స్  నా జీవితంలో అంతర్భాగం, సరైన సమయం వచ్చినప్పుడు నేను తిరిగి మైదానంలోకి వస్తానని ఆశిస్తున్నాను ”అని అన్నారు. 

ఆర్యమాన్ తన క్రికెట్ కెరీర్‌ను సరైన సమయంలో తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నాడని అతడి పోస్టును బట్టి అర్థమవుతుంది. అయితే ఇప్పటికయితే అతను ప్రొఫెషనల్ క్రికెట్‌లో పాల్గొనలేదు. గత ఫిబ్రవరిలో ఆర్యమాన్  అతని సోదరి అనన్య బిర్లా ఆదిత్య బిర్లా గ్రూప్‌కు అనుబంధంగా ఉన్న గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌కు డైరెక్టర్లుగా నియమితులయ్యారు. ప్రస్తుతం వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నారు. 
 

click me!