రేషన్ కార్డుతో లభించే ఉపయోగాలు, ప్రయోజనాలు ఎంటో తెలుసా..?

By Sandra Ashok KumarFirst Published Oct 5, 2020, 6:39 PM IST
Highlights

ఈ కార్డును రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు ఆహార ధాన్యాలు, బియ్యం, కిరోసేన్, నిత్యవసర వస్తువులు చాలా తక్కువ రేటుకు లభిస్తాయి. ఇవన్నీ రేషన్ షాప్ నుండి రేషన్ కార్డు ద్వారా పొందవచ్చు.

రేషన్ కార్డు ఉపయోగం ఏమిటి అని చాలా మంది తెలియక అనుకుంటుంటారు కానీ రేషన్ కార్డు చాలా ముఖ్యమైన ప్రభుత్వ గుర్తింపుగా పరిగణిస్తారు. ఈ కార్డును రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు ఆహార ధాన్యాలు, బియ్యం, కిరోసేన్, నిత్యవసర వస్తువులు చాలా తక్కువ రేటుకు లభిస్తాయి.

ఇవన్నీ రేషన్ షాప్ నుండి రేషన్ కార్డు ద్వారా పొందవచ్చు. రేషన్ కార్డు రేషన్ షాపు నుండి  నిత్యవసర వస్తువులు తీసుకోవటానికి మాత్రమే కాకుండా, బలమైన గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుంది. ఈ కార్డు బ్యాంకు ఖాతా, స్కూల్స్-కాలేజీలు, ఓటరు ఐడి, సిమ్ కార్డు కొనడం, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఉపయోగపడుతుంది.

also read 

వీటన్నిటితో పాటు రేషన్ కార్డు ద్వారా ఎల్‌పిజి గ్యాస్ కనెక్షన్ తీసుకోవడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఇలాంటి అనేక ఇతర ప్రయోజనాలకు రేషన్ కార్డు కూడా అవసరం.    

వేర్వేరు రంగు కార్డులు: రేషన్ కార్డులు వేర్వేరు రంగులలో ఉంటాయి. ఈ కార్డులు గులాబీ, తెలుపు మొదలైన రంగులలో ఉంటాయి. ఈ రంగులను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అనుసరిస్తున్నారు.

సాధారణంగా 3 రకాల రేషన్ కార్డులు ఉన్నాయి - దారిద్య్రరేఖకు పైన, దారిద్య్రరేఖకు దిగువన, అంత్యోదయ కుటుంబాలకు ఈ కార్డులు వర్తిస్తాయి. ఈ మూడు కార్డుల కోసం వేర్వేరు రంగులను సెట్ చేశారు. కార్డు రంగు ద్వారా ఎవరు ఏ వర్గానికి చెందినవారో సులభంగా గుర్తించవచ్చు. 

click me!