రిలయన్స్ రిటైల్‌లో కొనసాగుతున్న భారీ పెట్టుబడులు.. తాజాగా వేల కోట్ల డీల్..

By Sandra Ashok KumarFirst Published Oct 3, 2020, 3:32 PM IST
Highlights

తాజాగా మరో రెండు విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమయ్యాయి. సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ జిఐసి, గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టిపిజి క్యాపిటల్ రెండు సంస్థలు  కలిపి రిలయన్స్ రిటైల్ లో రూ.7,350 కోట్ల (సుమారు 1 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టనుంది. 

దేశీయ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్‌ఐ‌ఎల్) లో పెట్టుబడుల సునామీ కొనసాగుతుంది. తాజాగా మరో రెండు విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమయ్యాయి. సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ జిఐసి, గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టిపిజి క్యాపిటల్ రెండు సంస్థలు  కలిపి రిలయన్స్ రిటైల్ లో రూ.7,350 కోట్లు (సుమారు 1 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టనుంది.

తాజా పెట్టుబడులతో పాటురిలయన్స్ రిటైల్ ఇప్పటివరకూ 7.28 శాతం వాటాల విక్రయం ద్వారా రూ.32,197 కోట్ల పెట్టుబడులను సాధించింది.

ఆసియాలోని అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ యజమాన్యంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గత కొన్ని నెలలుగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో కెకెఆర్ & కో, అబుదాబి స్టేట్ ఫండ్ ముబదాలా, సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ సహా ప్రపంచ పెట్టుబడిదారుల నుండి 2 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులను సంపాదించింది.

also read  బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబరులో బ్యాంకులకు భారీగా సెలవులు.. ...

రిలయన్స్ రిటైల్ లో 1.22% వాటా కోసం జిఐసి రూ .5,512 కోట్లు పెట్టుబడి పెట్టగా, టిపిజి క్యాపిటల్ మేనేజ్‌మెంట్ 0.41 శాతం ఈక్విటీ వాటాను సొంతం చేసుకోవడానికి 1,838 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది.

రిలయన్స్‌లో టిపిజి క్యాపిటల్ చేసిన రెండవ పెట్టుబడి ఇది. అంతకుముందు జూన్ నెలలో రిలయన్స్ డిజిటల్ యూనిట్ జియో ప్లాట్‌ఫామ్‌లో 598 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది.

ముంబై ప్రధాన కార్యాలయం ద్వారా రిలయన్స్ రిటైల్ విభాగంలో వాటాలను కొనుగోలు చేయడం గురించి జియో ప్లాట్‌ఫామ్‌లలోని పెట్టుబడిదారులను సంప్రదించినట్లు ఒక వార్తా పత్రిక సెప్టెంబర్‌లో నివేదించింది.

ఇప్పటికే 12,000 స్టోర్లతో భారతదేశపు అతిపెద్ద రిటైలర్ అయిన రిలయన్స్  ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపారాన్ని 3.38 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకోవడానికి ఆగస్టులో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చున్న సంగతి తెలిసిందే.
 

click me!