Whatsapp: ఈ ఆండ్రాయిడ్, ఐఫోన్లలో రేపటి నుంచి వాట్సాప్ బంద్..మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి

Published : May 31, 2025, 01:41 PM IST
WhatsApp logo

సారాంశం

జూన్ 1 నుంచి పాత iPhone, Android ఫోన్లలో వాట్సాప్ పని చేయదు. మెటా భద్రతా కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.

జూన్ 1, 2025 నుంచి కొన్ని పాత మోడళ్ల స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోతున్నాయని మెటా సంస్థ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ప్రధానంగా వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. మొదట మే నెలలోనే ఈ మార్పులు రావాల్సి ఉన్నా, వినియోగదారులకు మరింత సమయం కల్పించేందుకు మెటా అదనంగా ఒక నెల సమయం ఇచ్చింది.

ఈ మేరకు సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం, ఐఓఎస్ 15 కంటే పాత వర్షన్ ఉన్న iPhone‌లలో, అలాగే Android 5.0 కన్నా పాత వర్షన్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ ఇకపై పనిచేయదు. అంటే, iPhone 5s, iPhone 6, 6 Plus, 6s, 6s Plus, మొదటి తరం iPhone SE వంటి పాత డివైస్‌లు, అలాగే Samsung Galaxy S4, Note 3, Sony Xperia Z1, LG G2, Huawei Ascend P6, Moto G (1st gen), Moto E (2014), Motorola Razr HD లాంటి ఆండ్రాయిడ్ ఫోన్లు వాట్సాప్‌కు ఇక మద్దతు ఇవ్వవు.

సైబర్ భద్రతకు..

ఈ పాత డివైస్‌లలో OS అప్‌డేట్ రావడం ఆగిపోయింది. ఇది సైబర్ భద్రతకు పెద్ద ముప్పుగా మారుతుంది. సెక్యూరిటీ ప్యాచెస్ లేకపోతే వ్యక్తిగత సమాచారం లీక్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే మెటా ముందస్తు చర్యగా వాట్సాప్ సేవలను నిలిపివేయనుంది.

ఇలాంటి పాత ఫోన్‌లను ఇప్పుడే మార్చేయాలా అనే సందేహం సహజమే. కానీ నిపుణులు ఒకటే సూచిస్తున్నారు – తొందరపాటు వద్దు. ముందుగా ఫోన్‌లో తాజా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను చెక్ చేయాలి. iOS 15.1 లేదా Android 5.1 వరకు అప్‌డేట్ చేయగలిగితే, వాట్సాప్ సేవలు కొనసాగుతాయి. అయితే, ఫోన్ అప్‌డేట్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే, కొత్త ఫోన్‌కి మారడం అవసరం.

కొత్త ఫోన్‌కు మారే ముందు తప్పకుండా చాట్ హిస్టరీను బ్యాకప్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. గూగుల్ అకౌంట్ లేదా ఐక్లౌడ్‌లో బ్యాకప్ తీసుకున్న తర్వాత, కొత్త ఫోన్‌లో అదే అకౌంట్‌తో లాగిన్ అయి చాట్ డేటా తిరిగి రీస్టోర్ చేసుకోవచ్చు.

ఈ మార్పులు లక్షలాది మంది పాత ఫోన్ వినియోగదారులపై ప్రభావం చూపనున్నాయి. భద్రతా పరంగా ముందుజాగ్రత్తగా మెటా తీసుకున్న ఈ నిర్ణయం ఫోన్ అప్‌డేట్‌లకు ఎంత ముఖ్యమో మరోసారి చూపిస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !
Best Investment : బంగారం vs వెండి vs రాగి.. 2025లో ఏది కొంటే జాక్‌పాట్? నిపుణుల సీక్రెట్ ఇదే !