Gold Rate: తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

Published : May 31, 2025, 12:26 PM IST
*ஏழை, நடுத்தர மக்களின் தலையில் இடியை இறக்கிய ரிசர்வ் வங்கி! இனி நகைக்கடன் பெற முடியாதா?*  https://tamil.asianetnews.com/gallery/tamilnadu/poor-and-middle-class-people-cannot-get-gold-loans-ramadoss-tvk-1iausut?utm_source=whatsapp&utm_medium=channel&utm_campaign=Daily

సారాంశం

Gold Rate: ఇటీవలే రూ.లక్ష మార్కును టచ్ చేసిన బంగారం ధర అనుకోకుండా ఒక్కసారిగా భారీగా పడిపోయింది. మళ్లీ ఇప్పుడు కొంచెం కొంచెంగా ధర పెరుగుతూ మళ్లీ రూ.లక్ష మార్కును దాటడానికి పరుగులు తీస్తోంది. ఈ రోజు(మే 31)న బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ప్రపంచంలో ఎప్పటికీ డిమాండ్ తగ్గని వస్తువు ఏదైనా ఉందంటే అది బంగారమే. ఒకప్పుడు 10 గ్రాములు రూ.10 వేలు కూడా లేని బంగారం ధర ఇటీవలే రూ.లక్ష మార్కును టచ్ చేసింది. ఇంత భారీగా, నమ్మకంగా ధర పెరుగుతున్న బంగారం పెరుగుదలకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక సంఘటనలు కారణమవుతుంటాయి. ఏదిఏమైనా బంగారం ధర పెరగడమే కాని ఇప్పట్లో భారీగా తగ్గే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు.

బంగారం ధరలు మే 31, 2025న ఎలా ఉన్నాయంటే..

మే 31, 2025న తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్ లో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా మార్పు లేకుండా ఉన్నాయి. మే 31న 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.8,920 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.9,366గా నమోదైంది.

విజయవాడలో కూడా బంగారం ధరలు హైదరాబాద్‌తో సమానంగా ఉన్నాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.8,920 పలుకగా, 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.9,366గా నమోదైంది.

ఇక విశాఖపట్నంలో బంగారం ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.8,990 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.9,808గా నమోదైంది.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు దాదాపు రూ.8,920 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు సుమారు రూ.9,738 గా ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.8,990 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.9,808గా ఉంది.

నోట్: ఈ ధరలు స్థానిక డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, రూపాయి మారకపు విలువ ఆధారంగా మారవచ్చు. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు మీ ప్రాంతాల్లో తాజా ధరలను పరిశీలించడం మంచిది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Business Idea: ఉద్యోగం చేసి చేసి బోర్ కొట్టిందా.? ల‌క్షాధికారి అయ్యే బెస్ట్ బిజినెస్ ఐడియా
iphone 15 Price: వామ్మో ఐఫోన్ 15పై ఏకంగా రూ.30,000 డిస్కౌంట్? ఎక్కడ కొనాలంటే