WhatsApp ఇకపై ఈ ఫోన్లలో పనిచేయదు. అందులో మీ ఫోన్ కూడా ఉందో లేదో చెక్ చేసుకోండి...

By Krishna AdithyaFirst Published Oct 11, 2022, 3:53 PM IST
Highlights

అదే పనిగా వాట్సాప్ వాడుతున్నారా అయితే మీ ఫోన్లో నేటి నుంచి వాట్సాప్ పని చేయదు. అయితే కంగారు పడొద్దు ఎందుకంటే వాట్సాప్ తెలిపిన సమాచారం ప్రకారం కొన్ని రకాల సెలెక్టెట్ ఐఫోన్స్ లో ఇకపై వాట్సప్ పని చేయదని తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో వాట్సాప్ లేకుండా ఒక్క నిమిషం కూడా గడపలేము. కమ్యూనికేషన్ రంగంలో వాట్సాప్ ప్రజల జీవితాల్లో పాతుకుపోయింది. ముఖ్యంగా వాట్సప్ నేటి యుగంలో కాలక్షేపం మాత్రమే కాదు సమాచారాన్ని సెకండ్ల వ్యవధిలోనే చేరవేసే ఒక అద్భుతమైన యాప్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వాట్సప్ ప్రస్తుతం కొన్ని సెలెక్టెడ్ సెల్ ఫోన్స్ లో పని చేయదని  వార్తలు వస్తున్నాయి అందులో మీ ఫోన్ కూడా ఉందో లేదో చెక్ చేసుకోండి. 

యాపిల్ వినియోగదారులకు షాక్! ఈ నెల నుండి ఈ కొన్ని రకాల iPhone వర్షన్ లలో WhatsApp పని చేయదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

వాట్సాప్ చాలా పాపులర్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్. లక్షల మంది దీనిని ఉపయోగిస్తున్నారు. కానీ, చాలా మంది ఐఫోన్ వినియోగదారులకు ఈ యాప్ అందుబాటులోకి రాకుండాపోతోంది.  ఈ మెసేజింగ్ యాప్  ఇకపై చాలా iPhone మోడల్‌లలో పని చేయదు. WhatsApp ఈ నెల నుండి అంటే అక్టోబర్ నుండి చాలా రకాల పరికరాలలో పనిచేయదు.

అయితే కొంత వరకు ఒక ఊరట ఉంది ఏమిటంటే పాత iPhoneలలో WhatsApp పని చేయదు. దీని గురించి ఇదివరకే  ఆపిల్ ప్రకటించింది .  ఆపిల్ కంపెనీ ప్రకారం, iOS 10, iOS 11 నడుస్తున్న iPhoneలలో WhatsApp పని చేయదు.

 వార్తల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం, WhatsApp ఈ సమాచారాన్ని వినియోగదారులకు అందించింది. దీని గురించి యూజర్లకు నోటిఫికేషన్లు కూడా  అందుతున్నాయి. అక్టోబర్ 24 నుంచి ఈ ఐఓఎస్ వెర్షన్‌లు నడుస్తున్న ఐఫోన్‌లలో వాట్సాప్ పనిచేయదు. కంపెనీ సహాయ కేంద్రం ప్రకారం, WhatsApp iOS 12 లేదా కొత్త వెర్షన్‌లలో పనిచేసే iPhoneలలో కూడా రన్ అవుతుంది.

ప్రస్తుతం iOS 10 లేదా iOS 11లో కేవలం రెండు iPhoneలు మాత్రమే పని చేస్తున్నాయి. Apple iPhone 5, iPhone 5c మోడల్స్ లో  iOS 12 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్‌లకు మద్దతు ఇవ్వవు. అటువంటి పరిస్థితిలో, మీరు ఈ ఫోన్‌లను ఉపయోగిస్తున్నట్లయితే, మీరు వెంటనే కొత్త ఫోన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

లేకపోతే, WhatsApp మీ పరికరంలో పనిచేయదు. మీ iPhone iOS 10 లేదా iOS 11లో పనిచేస్తుంటే, మీరు దాన్ని కొత్త సాఫ్ట్‌వేర్ వెర్షన్‌కి అప్‌డేట్ చేయవచ్చు. దీని కోసం మీరు మీ ఐఫోన్‌లోని సెట్టింగ్‌లకు వెళ్లాలి.

ఆ తర్వాత జనరల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. iOS 16 ఇప్పుడు చాలా కొత్త iPhoneలకు అందుబాటులో ఉంది. ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ iPhone 8 లేదా కొత్త iPhoneకి మాత్రమే అందుబాటులో ఉంటుంది.

click me!