యూనియన్ బడ్జెట్‌ నుండి గ్రామ ప్రజలకు ఏం కల్పిస్తాం..?: ప్రధాని మోదీ ప్రసంగంలోని కీలక అంశాలు ..

Ashok Kumar   | Asianet News
Published : Feb 23, 2022, 02:29 PM ISTUpdated : Feb 23, 2022, 02:30 PM IST
యూనియన్ బడ్జెట్‌ నుండి గ్రామ ప్రజలకు ఏం కల్పిస్తాం..?: ప్రధాని మోదీ  ప్రసంగంలోని కీలక అంశాలు ..

సారాంశం

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన వెబ్‌నార్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈసారి బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను అందించిందని ప్రధాని మోదీ తన ప్రసంగంలో తెలిపారు.

గ్రామీణాభివృద్ధిపై కేంద్ర బడ్జెట్ సానుకూల ప్రభావంపై బుధవారం జరిగిన వెబ్‌నార్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈసారి యూనియన్ బడ్జెట్‌లో గ్రామాలలో నివసించే ప్రజలకు ఏం లభిస్తుందో ప్రధాని మోదీ సులభమైన భాషలో వివరించారు. అలాగే ఈసారి బడ్జెట్ గ్రామ ప్రజల జీవనశైలిని ఎలా మెరుగుపరుస్తుందో తెలిపారు. ప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్య విషయాలను తెలుసుకుందాం...

ఈసారి బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికను అందించిందని, ఈ బడ్జెట్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గ్రామీణ సడక్ యోజన, జల్ జీవన్ మిషన్, నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ, గ్రామాల బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ ఇలా ప్రతి పథకానికి అవసరమైన కేటాయింపులు చేశారు అని ప్రధాని మోదీ అన్నారు.

గ్రామాల డిజిటల్ కనెక్టివిటీ 
గ్రామాల డిజిటల్ కనెక్టివిటీ ఇకపై ఆకాంక్ష కాదని, నేటి అవసరమని, బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ వల్ల గ్రామాల్లో సౌకర్యాలు కల్పించడమే కాకుండా గ్రామాల్లో స్కిల్స్ ఉన్న  యువత పెద్ద సంఖ్యలో ఏర్పడేందుకు కూడా దోహదపడుతుంది అని ప్రధాని అన్నారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మన మహిళా శక్తి ప్రధాన ఆధారం 
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం మన మహిళా శక్తి అని, ఆర్థిక నిర్ణయాలలో కుటుంబాల్లోని మహిళలు ఎక్కువగా భాగస్వామ్యాం కావడం ఆర్థిక చేర్చడం నిర్ధారిస్తుంది. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అన్నారు.

గ్రామలలో మరిన్ని స్టార్టప్‌లు
గ్రామలలో మరిన్ని స్టార్టప్‌లను తీసుకువచ్చేందుకు  మీరు మీ కృషిని మరింత పెంచాల్సి ఉంటుందని, ఓనర్‌షిప్ స్కీమ్ కింద 40 లక్షలకు పైగా ప్రాపర్టీ కార్డ్‌లను అందించామని ప్రధాని మోదీ మాట్లాడుతూ అన్నారు.

గ్రామలలో సాంకేతికతపై దృష్టి
గ్రామలలోని వివిధ పథకాల్లో 100% లక్ష్యాన్ని సాధించేందుకు కొత్త టెక్నాలజీపై కూడా దృష్టి సారిస్తామని ప్రధాని మోదీ అన్నారు. తద్వారా ప్రాజెక్టులు కూడా వేగంగా పూర్తవడంతో పాటు నాణ్యతకు లోటు ఉండదు. జల్ జీవన్ మిషన్ కింద దాదాపు 4 కోట్ల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. అలాగే పైపులైన్ల నాణ్యత, వచ్చే నీటిపై మనం చాలా శ్రద్ధ వహించాలని ప్రతి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

గ్రామీణ ప్రాంతాల్లో ఆప్టికల్ ఫైబర్ గురించి చెప్పాలంటే
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని మొత్తం ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడు అనుసంధానించిన గ్రామాల్లో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను సక్రమంగా ఉపయోగించడం గురించి గ్రామీణ ప్రజలకు తెలియజేయాలి అని అన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most Expensive Vegetables : కిలో రూ.1 లక్ష .. భారత్‌లో అత్యంత ఖరీదైన కూరగాయలు ఇవే
iPhone : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో, 15 ప్లస్‌పై భారీ తగ్గింపులు !