మార్చి 30, 31 తేదీల్లో ఏ బ్యాంకులు, ఆఫీసులు ఓపెన్ ఉంటాయో తెలుసా..

By Ashok kumar Sandra  |  First Published Mar 30, 2024, 10:04 AM IST

భారత రిజర్వ్ బ్యాంక్, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ అండ్  ఆదాయపు పన్ను శాఖ సకాలంలో ఆర్థిక లావాదేవీలు ఇంకా పన్ను బాధ్యతలను సులభతరం చేయడానికి మార్చి 31ని వర్కింగ్ డేగా  ప్రకటించాయి.
 


మార్చి 31 సాధారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి రోజు. బ్యాంకులు, ఇన్సురన్స్ కంపెనీలు ఇంకా  ట్యాక్స్  డిపార్ట్మెంట్  వంటి అనేక సంస్థలకు లావాదేవీల చివరి రోజు కాబట్టి ఈ రోజు ముఖ్యమైనది. అయితే ఈ ఏడాది మార్చి 31 ఆదివారం, మార్చి 28 గుడ్ ఫ్రైడే కావడంతో చాలా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు కావడంతో సంబంధిత ఉద్యోగులకు లాంగ్ వీకెండ్ వచ్చింది.

ఇప్పుడు సంక్లిష్టతలను క్లియర్ చేయడానికి, ఫైనాన్సియల్  ఇయర్  క్లోసింగ్  ఈజీ  చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ (IRDAI) అండ్   ఆదాయపు పన్ను శాఖ మార్చి 31ని వర్కింగ్ డేగా  మార్చాయి.

Latest Videos

undefined

బ్యాంకులు  ఓపెన్ 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రభుత్వ లావాదేవీలతో వ్యవహరించే అన్ని   బ్యాంకులు మార్చి 31, 2024న కార్యకలాపాలు కొనసాగిస్తాయని ప్రకటిస్తూ నోటీసు జారీ చేసింది. ఈ   బ్యాంకులు, RBIచే నియమించబడినవి. 

మార్చి 20, 2024 నాటి RBI నోటిఫికేషన్ ప్రకారం, “ప్రభుత్వ రిసిప్ట్స్  అండ్    చెల్లింపులతో వ్యవహరించే అన్ని బ్యాంకుల శాఖలను మార్చి 31, 2024 (ఆదివారం) లావాదేవీల కోసం తెరిచి ఉంచాలని భారత ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది.  దీని ప్రకారం బ్యాంకులు ప్రభుత్వ వ్యాపారంతో వ్యవహరించే అన్ని శాఖలను మార్చి 31, 2024 (ఆదివారం) తెరిచి ఉంచాలని సూచించింది.

మార్చి 31, 2024న అందుబాటులో ఉండే సేవలు

NEFT అండ్ RTGS

నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ (NEFT) ఇంకా  రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (RTGS) సిస్టమ్ ద్వారా లావాదేవీలు   మార్చి 31, 2024న అర్ధరాత్రి వరకు కొనసాగుతాయని RBI తెలిపింది.

 చెక్ క్లియరింగ్ 

ప్రభుత్వ ఖాతాలకు సంబంధించిన అన్ని చెక్కుల   క్లియరింగ్‌ 

  బ్యాంకులు చేపట్టే క్రింది ప్రభుత్వ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు ఏజెన్సీ కమిషన్‌కు అర్హులు:

> కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల తరపున రెవెన్యూ రిసిప్ట్స్  అండ్ పేమెంట్స్ 
> కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి పెన్షన్ పేమెంట్స్ 
> స్పెషల్ డిపాజిట్ స్కీమ్ (SDS) 1975
> పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీమ్, 1968
> సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), 2004
> కిసాన్ వికాస్ పత్ర, 2014 అండ్ సుకన్య సమృద్ధి అకౌంట్ 

  ఈ ముఖ్యమైన తేదీలో పనిచేయడానికి RBI 33   బ్యాంకులను నియమించింది. ఈ లిస్టులో  12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి, వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) వంటి ప్రముఖ పేర్లతో పాటు 20 ప్రైవేట్ రంగ బ్యాంకులు ఉన్నాయి, వాటిలో HDFC బ్యాంక్ లిమిటెడ్, ICICI బ్యాంక్ లిమిటెడ్ ఉన్నాయి. అదనంగా, DBS బ్యాంక్ ఇండియా లిమిటెడ్ ఈ ఏర్పాటులో ఏకైక విదేశీ బ్యాంకుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ బ్యాంకులు మార్చి 31న పూర్తి సేవలను అందించనున్నాయి.

ప్రభుత్వ రంగ బ్యాంకులు
1. బ్యాంక్ ఆఫ్ బరోడా
2. బ్యాంక్ ఆఫ్ ఇండియా
3. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
4. కెనరా బ్యాంక్
5. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
6. ఇండియన్ బ్యాంక్
7. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
8. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
9. పంజాబ్ నేషనల్ బ్యాంక్
10. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
11. UCO బ్యాంక్
12. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు
13. యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్
14. సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్
15. DCB బ్యాంక్ లిమిటెడ్
16. ఫెడరల్ బ్యాంక్ లిమిటెడ్
17. HDFC బ్యాంక్ లిమిటెడ్
18. ICICI బ్యాంక్ లిమిటెడ్
19. IDBI బ్యాంక్ లిమిటెడ్
20. IDFC FIRST బ్యాంక్ లిమిటెడ్
21. ఇండస్‌ఇండ్ బ్యాంక్ లిమిటెడ్
22. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ లిమిటెడ్
23. కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్
24. కరూర్ వైశ్యా బ్యాంక్ లిమిటెడ్
25. కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్
26. RBL బ్యాంక్ లిమిటెడ్

27. సౌత్ ఇండియన్ బ్యాంక్
28. యస్ బ్యాంక్ లిమిటెడ్
29. ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్
30. బంధన్ బ్యాంక్ లిమిటెడ్
31. CSB బ్యాంక్ లిమిటెడ్
32. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లిమిటెడ్

విదేశీ బ్యాంకులు
33. DBS బ్యాంక్ ఇండియా లిమిటెడ్ 

ఇన్సూరెన్స్  ఆఫీసులు 
IRDAI   కార్యాలయాలను మార్చి 30 అలాగే  మార్చి 31 తేదీల్లో తెరిచి ఉంచాలని కోరింది.

"పాలసీ హోల్డర్‌లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు, బీమాదారులు   కార్యాలయాలను మార్చి 30, 2024 ఇంకా మార్చి 31, 2024 తేదీల్లో సాధారణ పని వేళల ప్రకారం తెరిచి ఉంచాలని సూచించారు. బీమాదారులు గమనించి, చేసిన ప్రత్యేక ఏర్పాటుకు తగిన ప్రచారం కల్పించవచ్చు. పైన పేర్కొన్న విధంగా," IRDAI మార్చి 28, 2024న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

LIC ఆఫీసులు

LIC లేటెస్ట్  ట్వీట్‌లో  : “జోన్‌లు ఇంకా  డివిజన్‌ల పరిధిలోని కార్యాలయాలను 30.3.2024 అలాగే  31.3.2024 తేదీలలో అధికారిక పని గంటల ప్రకారం సాధారణ కార్యకలాపాల కోసం తెరిచి ఉంచాలని నిర్ణయించడం జరిగింది అని  పేర్కొంది

ఆదాయపు పన్ను శాఖ

ఈ నెల ప్రారంభంలో, ఆదాయపు పన్ను శాఖ ఈ లాంగ్ వీకెండ్‌ను పాటించడం లేదని, పెండింగ్‌లో ఉన్న పన్ను సంబంధిత పనులను పూర్తి చేయడానికి మార్చి 29 నుండి మార్చి 31 వరకు పనిచేస్తుందని ప్రకటించింది. 

"పెండింగ్‌లో ఉన్న డిపార్ట్‌మెంటల్ వర్క్ పూర్తి చేయడానికి, భారతదేశం అంతటా అన్ని ఆదాయపు పన్ను కార్యాలయాలు 29, 30 ఇంకా  31 మార్చి 2024లో తెరిచి ఉంటాయి" అని ఆదాయపు పన్ను శాఖ మార్చి 18, 2024 నాటి ఆర్డర్‌లో పేర్కొంది.

click me!