మీరు డెబిట్ కార్డ్ ఉపయోగిస్తున్నారా ? మళ్లీ కస్టమర్ల జేబు పై భారం !

By Ashok kumar Sandra  |  First Published Mar 28, 2024, 11:34 AM IST

అన్యువల్  మైంటైన్నెన్స్ ఛార్జీలు కాకుండా, డెబిట్ కార్డ్‌లకు సంబంధించిన ఇతర ఛార్జీలను కూడా SBI వివరించింది. డిస్బర్స్‌మెంట్ ఛార్జీలు కార్డును బట్టి మారుతుంటాయి అని  SBI తెలిపింది. 


న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్  ఖాతాదారులకు ఓ లేఖ రాసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిర్దిష్ట డెబిట్ కార్డులతో అనుబంధించబడిన అన్యువల్  మైంటైన్నెన్స్  చార్జెస్   రూ.75 పెంచుతున్నట్లు ప్రకటించింది. SBI వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ రూల్ ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుంది. అన్యువల్  మైంటైన్నెన్స్ ఛార్జీలు కాకుండా, డెబిట్ కార్డ్‌లకు సంబంధించిన ఇతర ఛార్జీలను కూడా SBI వివరించింది.

డిస్బర్స్‌మెంట్ ఛార్జీలు కార్డును బట్టి మారుతుంటాయి అని  SBI తెలిపింది. SBI ప్రకారం క్లాసిక్, సిల్వర్, గ్లోబల్ అండ్  కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్‌ల జారీ ఫీజు  సున్నా అయితే, ప్లాటినం డెబిట్ కార్డ్‌కు జారీ చేసే రుసుము రూ. 300 + GST  అంతేకాకుండా, కస్టమర్‌లు డెబిట్ కార్డ్ రీప్లేస్‌మెంట్ (రూ. 300+ GST), డూప్లికేట్ పిన్/పిన్ రీజెనరేషన్ (రూ. 50+ GST) ఇంకా  అంతర్జాతీయ లావాదేవీల వంటి సేవలకు చార్జెస్  చెల్లించాలి.

Latest Videos

undefined

అంతర్జాతీయ లావాదేవీల ఛార్జీలు ATMలలో బ్యాలెన్స్ విచారణ(enquiry) కోసం రూ. 25+ GST,   ఇ-కామర్స్ లావాదేవీలు, ATM కాష్  విత్ డ్రా ట్రాన్సక్షన్  కోసం ట్రాన్సక్షన్ మొత్తంలో 3.5% అండ్  పాయింట్ ఆఫ్ సేల్ (PoS) ట్రాన్సక్షన్ మొత్తంలో 3% ఇంకా GSTతో కలిపి కనీసం రూ. 100 ఉంటుంది.  కోట్ చేయబడిన అన్ని ఛార్జీలు 18% GSTకి లోబడి ఉంటాయి.

 ఇదిలా ఉంటే, SBI కార్డ్  పాలసీలలో మార్పును ప్రకటించింది. ఏప్రిల్ 1 నుండి, కొన్ని క్రెడిట్ కార్డ్‌లకు అద్దె చెల్లింపులపై రివార్డ్ పాయింట్‌ల సేకరణ నిలిపివేయనుంది.
 

click me!