విజయ్ మాల్యా రివ్యూ పిటిషన్ కొట్టివేత.. అక్టోబర్ 5న కోర్టు ముందుకు..

By Sandra Ashok KumarFirst Published Sep 1, 2020, 11:14 AM IST
Highlights

విజయ్  మాల్యా రివ్యూ పిటిషన్లు కొట్టివేసినందున, 05.10.2020న మధ్యాహ్నం 02:00 గంటలకు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఆ రోజు కోర్టు ముందు   మాల్యా ఉనికిని నిర్ధారించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, న్యూ ఢీల్లీకి ఆదేశించింది.

బ్యాంక్ లోన్ డిఫాల్ట్ కేసులో నిందితుడైన విజయ్ మిట్టల్ మాల్యా అక్టోబర్ 5న మధ్యాహ్నం 2 గంటలకు కోర్టుకు హాజరుకావాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. ఆ రోజు కోర్టు గదిలో ఆయన ఉనికిని నిర్ధారించుకోవాలని సుప్రీం కోర్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరింది.

విజయ్  మాల్యా రివ్యూ పిటిషన్లు కొట్టివేసినందున, 05.10.2020న మధ్యాహ్నం 02:00 గంటలకు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఆ రోజు కోర్టు ముందు   మాల్యా ఉనికిని నిర్ధారించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, న్యూ ఢీల్లీకి ఆదేశించింది. ఈ తీర్పు కాపీని ఫెసిలిటీ, కాంపిలెన్స్  కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు పంపించాల్సి ఉంటుంది.

 2017 లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ మాల్యా చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ తన పిల్లలకు 40 మిలియన్లను బదిలీ చేసినందుకు ధిక్కారానికి పాల్పడినందుకు మాల్యా మే 2017 కోర్టు ఉత్తర్వును సమీక్షించాలని కోరారు.

also read 

 కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రమోటర్ లిక్కర్ బారన్ మాల్యాపై మోసం, మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్నట్లు అభియోగాలు మోపారు. అతను ప్రస్తుతం యుకెలో ఉన్నాడు.

యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వం   విజయ్ మాల్యాను రప్పించడానికి సమయం సెట్ చేయలేదని బ్రిటిష్ హై కమిషనర్ సర్ ఫిలిప్ బార్టన్ గత నెలలో వార్తా సంస్థకి చెప్పారు. విజయ్ మాల్యాను అప్పగించడం చట్టపరమైన కేసు, దీనిపై నేను ఇంకేమీ మాట్లాడలేను అని కూడా బార్టన్ అన్నారు.

భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకు మాల్యాను ఏప్రిల్ 20, 2017న యుకె అధికారులు అరెస్టు చేశారు. బ్రిటీష్ హైకమిషన్ ప్రతినిధి మాట్లాడుతూ మాల్యాను అప్పగించే ముందు చట్టపరమైన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఒక నివేదిక తెలిపింది.

"యునైటెడ్ కింగ్‌డమ్ చట్టం ప్రకారం, చట్టపరమైన సమస్యలను పరిష్కరించబడే వరకు మాల్యని అప్పగించడం జరగదు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుందో మేము అంచనా వేయలేము. వీలైనంత త్వరగా దీనిని పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తున్నాము" అని ఒక అధికారి చెప్పారు.

click me!