ఇండియా మొట్టమొదటి సోలార్ కారు లాంచ్ కి రెడీ: మైలేజ్ తెలిస్తే షాక్ అవుతారు

By Naga Surya Phani Kumar  |  First Published Dec 27, 2024, 5:52 PM IST

భారతదేశంలోనే మొట్టమొదటి సోలార్ కారు లాంచ్ కి రెడీ అవుతోంది. డిల్లీ లో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఈ కారు ఆవిష్కరించనున్నారు. ఈ కారు ఫీచర్స్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కారు ధర, మైలేజ్, ఇంజిన్ కెపాసిటీ తదితర వివరాలు తెలుసుకుందాం రండి. 


ఇప్పటి వరకు మనం రకరకాల ఇంధనాలతో నడిచే కార్లను చూశాం కదా.. డీజిల్, పెట్రోల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు మన చుట్టూనే తిరుగుతున్నాయి. ఇవి కాకుండా ఇథనాల్, హైడ్రోజన్ తో నడిచే వాహనాల గురించి కూడా మీరు వినే ఉంటారు. ఇప్పుడు సోలార్ కార్లు కూడా వస్తున్నాయి. పూణేకు చెందిన వేవ్ మొబిలిటీ సంస్థ భారతదేశపు మొట్టమొదటి సోలార్ కారు ‘ఈవా’ను మార్కెట్లోకి విడుదల చేయడానికి రెడీ చేసింది. ఇది 2025 జనవరిలో జరగనున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో లాంచ్ కాబోతోంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. ఈ కారులో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. తక్కువ ఖర్చుతో నగర ప్రయాణాలకు ఈ కారు చాలా చక్కగా ఉపయోగపడుతుంది.

జనవరి 17 నుండి 22 వరకు

వేవ్ మొబిలిటీ సంస్థ తన మొదటి సోలార్ కారు ‘ఈవా’ను జనవరి 17 నుండి 22 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఎక్స్ పోలో ప్రదర్శనకు ఉంచుతోంది. ఈవా ధర తక్కువగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ కారు కిలోమీటరుకు రూ.0.5 మాత్రమే ఖర్చవుతుందని కంపెనీ చెబుతోంది. 

సూర్యకాంతితో 3000 కి.మీ. ఉచిత ప్రయాణం

Latest Videos

undefined

ఆటో ఎక్స్‌పో 2023లో వేవ్ మొబిలిటీ ఈవా తొలి వెర్షన్‌ను రిలీజ్ చేసింది. దానికి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు కొత్త వెర్షన్ ను తీసుకొస్తోంది. ఈవా కారును నగర అవసరాలకు అనుగుణంగా తయారు చేశారు. ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు, ఖరీదైన పెట్రోల్ వంటి చిక్కులను తప్పించుకోవడానికి ఇది మంచి మార్గం. ఈ కారు సన్ లైట్ ని ఉపయోగించుకొని సంవత్సరానికి 3000 కి.మీ. ప్రయాణం చేస్తుంది. అంటే మీరు రూపాయి కూడా ఖర్చు చేయక్కరలేకుండా సంవత్సరంలో 3 వేల కి.మీ. ఉచితంగా తిరగొచ్చన్న మాట. దాని హై వోల్టేజ్ టెక్నాలజీ వల్ల ఇది త్వరగా ఛార్జ్ అవుతుంది. 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే 50 కి.మీ. ప్రయాణించవచ్చు.

గంటకు 70 కి.మీ. వేగం

వేవ్ ఈవా మాక్సిమం స్పీడ్ గంటకు 70 కి.మీ. ఇది 5 సెకన్లలో 0 నుండి 40 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఈవాలో చాలా స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. ఇది మీ స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ అవుతుంది. వాహనానికి సంబంధించిన సమాచారాన్ని మీకు అందిస్తుంది. రిమోట్ ద్వారా కూడా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఓవర్ దిఎయిర్ (OTA) అప్‌డేట్స్ ద్వారా కొత్త ఫీచర్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. 

సీఈఓ నిలేష్ బజాజ్ ఏమన్నారంటే..

వేవ్ మొబిలిటీ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నిలేష్ బజాజ్ ఇటీవల మాట్లాడుతూ.. ఈవా కొత్త తరహా నగర కార్లను తయారు చేయాలనే లక్ష్యంతో పని చేస్తోంది అన్నారు. సోలార్ ఎనర్జీ, స్మార్ట్ కనెక్టివిటీతో ఈవా నగర ప్రయాణాలకు అనువైన, అందుబాటు ధరలో లభించే వాహనం అని ఆయన అన్నారు. భారతదేశంలో ప్రజలు రోజుకు సగటున 35 కి.మీ. కంటే తక్కువ ప్రయాణం చేస్తారు. ఒంటరిగా లేదా ఒకరితో కలిసి ప్రయాణిస్తారు. ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వేవ్ ఈవాను రూపొందించామని ఆయన తెలిపారు.

click me!