
నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియా కంపెనీని కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసి దేశం గర్వించదగ్గ సంస్థ టాటా ఇప్పుడు వందే భారత్ రైలు నిర్మాణంలో పాలుపంచుకోబోతోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి గర్వకారణమైన సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ నిర్మాణంలో టాటా గ్రూప్ కూడా చేతులు కలిపేందుకు సిద్ధం అవుతోంది. వందే భారత్ రైల్‌కు పెరుగుతున్న ప్రజాదరణ దృష్ట్యా, టాటా గ్రూప్‌కు చెందిన ప్రధాన విభాగమైన టాటా స్టీల్ రైలు నిర్మాణంలో భాగస్వామిగా ఉండటానికి ఆసక్తిని వ్యక్తం చేసింది.
వచ్చే ఏడాదిలో 22 వందేభారత్ రైళ్లను నిర్మించాలని టాటా స్టీల్ నిర్ణయించింది. తాజాగా టాటా స్టీల్, ఇండియన్ రైల్వేల మధ్య ఇందుకు సంబంధించి ఒప్పందం కుదిరింది. వచ్చే రెండేళ్లలో 200 కొత్త వందేభారత్ రైళ్లను తయారు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.వందే భారత్ 2024 మొదటి త్రైమాసికం నాటికి రైలు మొదటి స్లీపర్ వెర్షన్‌ను పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
టాటా స్టీల్ కంపెనీ ఇప్పుడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఫస్ట్ క్లాస్ ఏసీ నుంచి త్రీ టైర్ కోచ్‌ల వరకు సీట్లను తయారు చేయనుంది. రైల్వేస్ తరపున, LHB ప్లాట్‌ఫారమ్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కోచ్‌లను తయారు చేసే కాంట్రాక్ట్‌ను కూడా టాటా స్టీల్ పొందింది. దీని కింద ప్యానెల్లు, కిటికీలు, రైల్వే నిర్మాణాలు సిద్ధమవుతున్నాయి.
145 కోట్ల టెండర్:
వందే భారత్ రైళ్ల విడిభాగాలను తయారు చేసేందుకు భారతీయ రైల్వే దాదాపు రూ. 145 కోట్ల విలువైన టెండర్‌ను టాటా స్టీల్‌కు అప్పగించింది. ఈ పనిని 12 నెలల్లో పూర్తి చేయాలన్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని 22 రైళ్లకు సీట్లు తయారు చేయడానికి కంపెనీ ఆర్డర్‌ను పొందింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సీట్ల కోసం 145 కోట్ల రూపాయల భారీ టెండర్‌ను స్వీకరించిన తర్వాత టాటా స్టీల్ కాంపోజిట్స్ విభాగం ఆ పనిని ప్రారంభించింది. టాటా స్టీల్ ప్రతి రైలు సెట్‌లో 16 కోచ్‌లతో 22 రైలు సెట్‌లకు పూర్తి సీటింగ్ ఏర్పాట్లను అందిస్తుంది.
ఈ విషయమై టాటా స్టీల్ వైస్ ప్రెసిడెంట్ (టెక్నాలజీ అండ్ న్యూ మెటీరియల్స్ బిజినెస్) దేబాశిష్ భట్టాచార్య మాట్లాడుతూ.. ఈ రైలు సీట్లను ప్రత్యేకంగా డిజైన్ చేయనున్నట్టు తెలిపారు. ఇది 180 డిగ్రీల వరకు ఒంగుతుంది. విమానం లాంటి ప్రయాణీకుల సౌకర్యాలను కలిగి ఉంటుంది. భారతదేశంలో ఇలాంటి ప్రయాణీకుల సౌకర్యాలు ఇవే మొదటివి. వచ్చే 12 నెలల్లో ఇది అమలులోకి రానుంది.
టాటా స్టీల్ రైల్వే వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తోంది:
టాటా స్టీల్ రైల్వేలో తన వ్యాపారాన్ని నిరంతరం పెంచుకోవడంలో నిమగ్నమై ఉంది. రైల్వే శాఖతో సమన్వయం చేసుకునేందుకు అధికారులను కూడా నియమించారు. టాటా స్టీల్ ముంబై-అహ్మదాబాద్ కారిడార్‌లో ఇఫ్పటికే పనిచేస్తోంది. రైల్వేతో టాటా స్టీల్ వ్యాపార సమన్వయం కోసం టాటా స్టీల్ కొత్త మెటీరియల్స్ బిజినెస్ హెడ్ గా టాటా మోటార్స్ డిప్యూటీ GM ఆరాధనా లాహిరిని టాటా స్టీల్ నియమించింది. రైల్వే బిజినెస్ ప్లాన్ అమలును ఆయన పర్యవేక్షిస్తారు.