కరోనా ఎఫెక్ట్: అమెరికా కుబేరుల సంపద ఇలా పెరిగింది..

By narsimha lodeFirst Published Jun 7, 2020, 12:14 PM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగా అందరూ గత మూడు నెలలుగా ఆర్థికంగా ఇబ్బందుల పాలై ఉంటారు. అందుకు అమెరికా కూడా మినహాయింపేం కాదు. అయితే కొంత మంది అమెరికన్‌ బిలియనీర్లు మాత్రం మరింత సంపదను వెనకేసుకురావడమే విశేషం.

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా అందరూ గత మూడు నెలలుగా ఆర్థికంగా ఇబ్బందుల పాలై ఉంటారు. అందుకు అమెరికా కూడా మినహాయింపేం కాదు. అయితే కొంత మంది అమెరికన్‌ బిలియనీర్లు మాత్రం మరింత సంపదను వెనకేసుకురావడమే విశేషం.

కానీ అమెరికా కుబేరుల సంపద 3.5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నది. ఈ ఏడాది మార్చి 18వ తేదీ నుంచి అమెరికా బిలియనీర్ల సంపద 19% పెరిగింది. దాదాపు 565 బిలియన్‌ డాలర్ల మేర ఎక్కువగా ఆర్జించారని 'ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాలసీ స్టడీస్‌' నివేదిక చెబుతోంది. 

also read:5% తక్కువకే: తెలుగు రాష్ట్రాల్లో జియోమార్ట్ సేవలు ప్రారంభం...
కానీ సామాన్య అమెరికన్ల పరిస్థితి మరొక విధంగా ఉంది. 4.3 కోట్ల మంది అమెరికా పౌరులు మాత్రం నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకున్నారు. చాలా మంది తక్కువ ఆదాయ సిబ్బంది.. ముఖ్యంగా ప్రయాణ, సేవా రంగ ఉద్యోగులపై ఈ సంక్షోభం తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ సంక్షోభం కారణంగా అసమానతలు మరింత పెరగనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

స్టాక్‌మార్కెట్‌లో రికవరీతో అమెరికా కుబేరుల సంపద పెరుగుతూ పోయింది. ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక రేట్లను సున్నా వద్ద ఉంచడం, బాండ్లను భారీగా కొనుగోలు చేస్తామన్న హామీని ఇవ్వడం మార్కెట్‌ రాణించడానికి దోహదం చేసింది. ముఖ్యంగా దిగ్గజ సాంకేతిక కంపెనీలు ఈ ర్యాలీలో లబ్ది పొందాయి. కరోనా వేళ మరింత రాణించాయి.

ఉదాహరణకు అమెజాన్‌ను తీసుకుంటే.. కరోనా తర్వాతే ఈ సంస్థ సేవలు మరింత అత్యవసరంగా మారాయి. మార్చి నాటి కనిష్ఠాల నుంచి అమెజాన్‌ షేర్ 47 శాతం పెరిగింది. దీంతో అమెజాన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ నికర విలువ మార్చి 18తో పోలిస్తే 36.2 బిలియన్‌ డాలర్లు అధికంగా పెరిగింది.

ఫేస్‌బుక్‌ షేరు రికార్డు గరిష్ఠాలకు చేరింది. దీంతో ఫేస్ బుక్ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ సంపద మార్చి 18తో పోలిస్తే 30.1 బిలియన్‌ డాలర్లు పెరిగింది.

టెస్లా కార్ల తయారీ సంస్థ అధిపతి ఎలాన్‌ మస్క్‌, గూగుల్‌ వ్యవస్థాపకులు సెర్గీ బ్రిన్‌, లారీ పేజ్,; మైక్రోసాఫ్ట్‌ మాజీ సీఈఓ స్టీవ్‌ బామర్‌ ఒక్కొక్కరు 13 బిలియన్‌ డాలర్లు అంత కంటే ఎక్కువ సంపదను పెంచుకోగలిగారు. 1990- 2020 మధ్య అమెరికా కుబేరుల సంపద 1130% మేర పెరిగింది.

click me!