
జపాన్ కు చెందిన హిటాచీ లిమిటెడ్ కంపెనీ భారతదేశపు మొట్టమొదటి UPI-ATMని ప్రారంభిస్తున్నట్లు కంపెనీ మంగళవారం తెలిపింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)తో కలిసి కంపెనీ ATMకి హిటాచీ మనీ స్పాట్ UPI ATM అని పేరు పెట్టారు.
ఈ ఏటీఎంలో కార్డ్‌లెస్ లావాదేవీలు చేయవచ్చని, అంటే ఇది కార్డ్‌లెస్‌గా ఉంటుందని, ఏటీఎం కార్డు అవసరం ఉండదని కంపెనీ తెలిపింది. అంటే ఏటీఎంకు వెళ్లగానే ఏటీఎంలో క్యూఆర్ కోడ్ వచ్చి స్కాన్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే నగదు బయటకు వస్తుంది. UPI-ATMతో, వినియోగదారులు అనేక బ్యాంకుల ఖాతాల నుండి డబ్బును తీసుకోవచ్చు. దీని కోసం వారు కేవలం UPI యాప్‌ని ఉపయోగించాలి. ఈ ఏటీఎం ఎలాంటి బ్యాంకుకు అనుబంధంగా ఉండదు అని గుర్తుంచుకోవాలి.
డెబిట్ కార్డు వ్యాప్తి తక్కువగా ఉన్న లేదా పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను సులభంగా యాక్సెస్ చేసేందుకు ఈ విధానం ప్రోత్సహిస్తామని కంపెనీ తెలిపింది. ఎన్‌పిసిఐ చైర్మన్ “ఎటిఎమ్ లావాదేవీల కోసం ఈ వినూత్నమైన , కస్టమర్ ఫ్రెండ్లీ టెక్నాలజీ ప్రవేశ పెట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు, UPI ATM , ప్రారంభం సాంప్రదాయ ATMలలో UPI సౌలభ్యం చేయడం ద్వారా బ్యాంకింగ్ సేవల్లో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందన్నారు.. ఫిజికల్ కార్డ్ అవసరం లేకుండా భారతదేశంలోని మారుమూల ప్రాంతాలలో కూడా నగదును తక్షణమే పొందేందుకు ఈ టెక్నాలజీ రూపొందించబడింది.
హిటాచీ ఏకైక వైట్ లేబుల్ ATM ఆపరేటర్
ఇదిలా ఉండగా, నగదు డిపాజిట్ సదుపాయాన్ని అందించే ఏకైక వైట్ లేబుల్ ATM ఆపరేటర్ హిటాచీ పేమెంట్ సర్వీసెస్ అని కూడా గమనించడం ముఖ్యం. ఇది భారతదేశంలోని 3,000 ప్రదేశాలలో ATMలను కలిగి ఉంది.
హిటాచీ పేమెంట్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ (MD), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) సుమిల్ వికామ్సే మాట్లాడుతూ, “ఈ కొత్త ఆఫర్ ఏ బ్యాంక్ కస్టమర్‌కైనా QR ఆధారిత UPI నగదు విత్ డ్రాయిల్ అనుమతిస్తుంది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న చెల్లింపు విధానం UPI అని పేర్కొన్నారు.
హిటాచీ పేమెంట్ సర్వీసెస్ డైరెక్టర్ (ప్రొడక్ట్స్ & డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్) మహేష్ పటేల్ మాట్లాడుతూ, “NPCI సహకారంతో దేశంలోనే మొట్టమొదటి UPI ATMని ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. హిటాచీ మనీ స్పాట్ UPI ATM Android ఆపరేటింగ్ సిస్టమ్‌పై నిర్మించబడింది. ATM బ్యాంకింగ్ ల్యాండ్‌స్కేప్‌లో UPI ఒక ప్రధాన మైలురాయిగా నిరూపించబడుతుందని మేము నమ్ముతున్నామని పేర్కొన్నారు.
హిటాచీ నిర్వహణలో 65,500 కంటే ఎక్కువ ATMలు ఉన్నాయి. అదనంగా, ఇది 30 లక్షల మర్చంట్ టచ్‌పాయింట్‌లకు సేవలు అందిస్తుంది. ప్రతిరోజూ 70 లక్షల డిజిటల్ లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది.