కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పదవి నుంచి బిలియనీర్ ఉదయ్ కోటక్ సెప్టెంబర్ 2న వైదొలిగారు. అయితే ఉదయ్ కోటక్ సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ చేసి.. సంస్థ ప్రణాళికల గురించి వివరించారు.
కోటక్ మహీంద్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పదవి నుంచి బిలియనీర్ ఉదయ్ కోటక్ సెప్టెంబర్ 2న వైదొలిగారు. అయితే సంస్థ తదుపరి వారసుడిని ఎంపిక చేసే వరకు.. ప్రస్తుత జాయింట్ ఎండీ దీపక్ గుప్తా తాత్కాలిక సీఈవో పదవిని కూడా నిర్వహించనున్నారు. అయితే ఉదయ్ కోటక్ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ముఖ్యమైన వాటాదారుగా కొనసాగుతారు. అయితే ఉదయ్ కోటక్ సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్.. వారసత్వ ప్రణాళికల గురించి వివరించారు. 10,000 రూపాయల పెట్టుబడితో ఇప్పుడు కోట్ల విలువైన రాబడిని ఇస్తూ.. ఈ సంవత్సరాల్లో తన కంపెనీ విలువలో ఎలా వృద్ధి చెందిందో కూడా హైలైట్ చేశారు. ‘‘1985లో మా దగ్గర పెట్టిన రూ. 10,000 పెట్టుబడి విలువ నేడు దాదాపు రూ. 300 కోట్లు అవుతుంది’’ అని ఉదయ్ కోటక్ పేర్కొన్నారు.
అయితే ఉదయ్ కోటక్.. కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో తన పదవి నుంచి సంవత్సరం చివరి నాటికి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. అయితే ఛైర్మన్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా త్వరలో తమ ఉద్యోగాలను వదిలివేయబోతున్నందున దశలవారీగా సాఫీగా మారాలని నిర్ణయాన్ని మార్చుకున్నారు.
‘‘కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో వారసత్వం నా మనస్సులో ప్రధానమైనది. ఎందుకంటే మా చైర్మన్, నేను, జాయింట్ ఎండీ అందరూ సంవత్సరాంతానికి పదవీ విరమణ చేయవలసి ఉంది. ఈ నిష్క్రమణలను క్రమం చేయడం ద్వారా సాఫీగా పరివర్తన చెందాలని నేను ఆసక్తిగా ఉన్నాను. నేను ఇప్పుడు ఈ ప్రక్రియను ప్రారంభించాను. సీఈవోగా స్వచ్ఛందంగా వైదొలగుతున్నాను’’ అని ఉదయ్ కోటక్ పేర్కొన్నారు.
బ్యాంక్ డైరెక్టర్ల బోర్డుకు రాసిన లేఖలో.. తాను విషయాలను ఆలోచించానని, ప్రస్తుతం రాజీనామా చేయడం సంస్థకు సరైన విషయమని నమ్ముతున్నానని ఉదయ్ కోటక్ పేర్కొన్నారు.
అలాగే 38 సంవత్సరాల క్రితం ముంబైలో ముగ్గురు ఉద్యోగులతో, 300 చదరపు అడుగుల ఆఫీసుతో బ్యాంక్‌ను ఎలా ప్రారంభించారో కూడా ఉదయ్ కోటక్ గుర్తు చేసుకున్నారు. జేపీ మోర్గాన్, గోల్డ్‌మన్ శాక్స్ వంటి కంపెనీల ద్వారా భారతదేశంలో ఇలాంటి సంస్థను ప్రారంభించేందుకు ప్రేరణ పొందినట్టుగా చెప్పారు. తమ కంపెనీ ఒక లక్షకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించిందని ఉదయ్ కోటక్ వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని ఆర్థిక శక్తిగా మార్చడంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ గణనీయమైన పాత్రను కొనసాగిస్తుందని తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచినందుకు తన సహోద్యోగులకు, యజమానులకు, వాటాదారులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపారు.
ఇక, కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ సెప్టెంబర్ 1న బీఎస్‌ఈ 0.66 శాతం లాభంతో ఒక్కో షేరుకు రూ. 1,771.30 వద్ద ముగిసింది. బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రస్తుతం రూ. 3.52 లక్షల కోట్లుగా ఉంది.