అదానీ గ్రూపులో అక్రమాలపై OCCRP నివేదికలో సంచలన విషయాలు..మారిషస్ కంపెనీల పెట్టుబడులపై షాకింగ్ రిపోర్ట్..

By Krishna Adithya  |  First Published Sep 1, 2023, 7:48 PM IST

ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరపక్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) అదానీ గ్రూప్‌పై పులు ఆరోపణలు చేసింది.ఈ ఆరోపణల్లో ముఖ్యంగా గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీకి చెందిన దుబాయి కంపెనీ నుంచి అక్రమంగా మారిషస్ కంపెనీల పేరిట అదానీ గ్రూపులోకి పెట్టుబడులు ప్రవేశించాయని, తద్వారా కంపెనీ షేర్లు అమాంతంగా పెరిగినట్లు OCCRP ఆరోపించింది. 


గౌతమ్ అదానీ కుటుంబం 2013-18 మధ్య కాలంలో మారిషస్‌కు చెందిన ఓపెక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ద్వారా తమ సొంత కంపెనీల షేర్లలో రహస్యంగా భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు తీవ్ర ఆరోపణ వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అదానీ గ్రూప్ షేర్ల విలువ భారీగా పెరిగింది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరపక్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (OCCRP) అదానీ గ్రూప్‌పై ఈ  ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌ తోసిపుచ్చింది. అంతేకాదు దశాబ్దాల క్రితం విచారణ జరిపి క్లీన్ చిట్ ఇచ్చిన కేసులో ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టింది. 

గత జనవరిలో కూడా అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన హిండెన్‌బర్గర్ కంపెనీ పలు ఆరోపణలు చేసింది. ఆ తర్వాత అదానీ గ్రూపునకు చెందిన వివిధ కంపెనీల షేర్ విలువ 150 బిలియన్ డాలర్లు (రూ. 12 లక్షల కోట్లు) పైగా పడిపోయింది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత, ఇటీవల అమెరికాకు చెందిన ప్రముఖ బిలియనీర్ జార్జ్ సోరోస్ ఒక ప్రకటన చేశారు. భారతదేశంలోని ప్రముఖ కంపెనీలలో ఒక కంపెనీ అక్రమాలను త్వరలో బయటపెడతామని ప్రకటించారు. సరిగ్గా ఇప్పుడు అదానీపై జార్జ్ సోరోస్ నుంచి ఫండింగ్ పొందే సంస్థ  OCCRP నుంచి ఓ నివేదిక విడుదలైంది.

Latest Videos

ఆరోపణలు ఇవే 
అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీకి దుబాయ్‌లో ఓ కంపెనీ ఉంది. అతని తరపున, యుఎఇకి చెందిన నాజర్ అలీ షాబాన్,  తైవాన్‌కు చెందిన చాంగ్ చుంగ్ లింగ్ అనే వ్యక్తులు అదానీ గ్రూప్‌లో రెండు మారిషస్ ఆధారిత పెట్టుబడి సంస్థల ద్వారా బిలియన్ల డాలర్లను ఇన్వెస్ట్ చేశారు. అంటే పరోక్షంగా అదానీ గ్రూప్ తమ సొంత కంపెనీలో రహస్యంగా భారీ మొత్తంలో విదేశీ కంపెనీల పేరిట పెట్టుబడి పెట్టిందని, తద్వారా  కంపెనీ షేర్ విలువ గణనీయంగా పెరిగిందని ఓసీసీఆర్పీ ఆరోపించింది.

ఆరోపణకు నిదర్శనం: 
2014లో అదానీ గ్రూప్ షేరు ధర భారీగా పెరిగింది. దీని ఆధారంగా  కంపెనీ ఇంటర్నల్ ఇ-మెయిల్స్ ఆధారంగా, ఏజెన్సీ ఈ పరిశోధనాత్మక నివేదికను సిద్ధం చేసింది. అంతేకాకుండా, అప్పుటి సెబీ ఛైర్మన్‌గా ఉన్న యుకె సిన్హా ఇప్పుడు అదానీ గ్రూప్‌కు చెందిన ఎన్‌డిటివి గ్రూప్‌కు డైరెక్టర్, ఛైర్మన్‌గా ఉన్నారని నివేదిక పేర్కొంది.

గౌతమ్ అదానీ గ్రూపు వ్యవహారాలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి డిమాండ్ చేశారు. మారిషస్‌కు చెందిన ఓ కంపెనీ అదానీలో రహస్యంగా పెట్టుబడులు పెట్టిందని అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఆరోపించడంతో రాహుల్ ఈ పట్టుబట్టారు.

గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 'ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి నేడు అదానీ గ్రూపుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెబీ నివేదిక కూడా ఈ విషయాన్ని ఆరోపించింది. కానీ ప్రభుత్వం వాటన్నింటినీ కప్పిపుచ్చి క్లీన్ చిట్ ఇవ్వడం సరికాదు. అదానీ అక్రమాలపై విచారణకు జాయింట్ హౌస్ కమిటీ వేయాలి. మారిషస్ కంపెనీల అక్రమ పెట్టుబడుల వెనుక గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ హస్తం ఉంది. మారిషస్ కంపెనీల సొమ్ము అదానీకి చెందుతుందని అంటున్నారు. దీనిపై విచారణ జరిపించాలని రాహుల్ డిమాండ్ చేశారు.

click me!