ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్.. బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌పై కీలక నిర్ణయం

By asianet news telugu  |  First Published Nov 12, 2022, 11:29 AM IST

ట్విట్టర్ కంపెనీ ప్లాట్‌ఫారమ్‌లో బ్లూ టిక్ కోసం US$8 చార్జ్ చేయబోతున్నట్లు కొద్దిరోజుల క్రితం తెలిపింది. అలాగే, ఈ ఎనిమిది డాలర్లకు బదులుగా కంపెనీ యూజర్లకు ప్రత్యేక బెనెఫిట్స్ కూడా ఇవ్వబోతోంది. అంటే, డబ్బు చెల్లించడం ద్వారా ఎవరైనా బ్లూ టిక్ పొందవచ్చు. 


మైక్రో బ్లాగ్గింగ్ సైట్ ట్విట్టర్ బ్లూ టిక్స్ కోసం $8 డాలర్లు చార్జ్ చేయాలనే ఎలోన్ మస్క్ నిర్ణయం కొత్త చిక్కుల్లో పడింది. యూ‌ఎస్ లోని చాలా మంది ఫేక్ అక్కౌంట్ ఉన్నారు $8 డాలర్లు చెల్లించి బ్లూ టిక్‌లను పొందారు. ఆ తర్వాత ఈ అక్కౌంట్స్ నుండి ఫేక్ ట్వీట్లు చేయబడ్డాయి. దీంతో ఇబ్బంది పడిన ట్విట్టర్ శుక్రవారం బ్లూ టిక్ సబ్‌స్క్రైబర్ సర్వీస్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ని కొనుగోలు చేయడానికి ముందు బ్లూ టిక్‌లు సెలబ్రిటీలు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు మొదలైన వారికి మాత్రమే ఉండేవి. ఎలోన్ మస్క్ కొత్త రూల్ ప్రకారం, ఇప్పుడు ప్రతి నెల $ 8 డాలర్లు ఖర్చు చేయగల సామర్థ్యం ఉన్న ఎవరైనా బ్లూ టిక్‌ని పొందవచ్చు.

యుఎస్‌లో  ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎలి లిల్లీ అండ్ కో నకిలీ అక్కౌంట్ సృష్టించి బ్లూ టిక్ పొందింది అంతేకాదు ఇన్సులిన్ ఉచితంగా లభిస్తుందని ట్వీట్ చేసింది. తర్వాత ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఈ కంపెనీ మాత్రమే కాదు, ఎలోన్ మస్క్ స్వంత కంపెనీ టెస్లా అండ్ స్పేస్ ఎక్స్ మొదలైన కంపెనీల పేరుతో నకిలీ ఖాతాలను సృష్టించారు. 

Latest Videos

undefined

ట్విట్టర్ కంపెనీ ప్లాట్‌ఫారమ్‌లో బ్లూ టిక్ కోసం US$8 చార్జ్ చేయబోతున్నట్లు కొద్దిరోజుల క్రితం తెలిపింది. అలాగే, ఈ ఎనిమిది డాలర్లకు బదులుగా కంపెనీ యూజర్లకు ప్రత్యేక బెనెఫిట్స్ కూడా ఇవ్వబోతోంది. అంటే, డబ్బు చెల్లించడం ద్వారా ఎవరైనా బ్లూ టిక్ పొందవచ్చు. 

డబ్బు చెల్లించడానికి సిస్టమ్‌ను ప్రారంభించిన తర్వాత కొంతమంది యూజర్లు దానిని దుర్వినియోగం చేస్తున్నారని ట్విట్టర్ బ్లూ వెరిఫికేషన్ గురించి నివేదికలు వచ్చాయి. ట్విట్టర్ అల్గారిథమ్‌ల ద్వారా తప్పు వ్యక్తులను కూడా గుర్తిస్తోంది.  చాలా మంది ప్రజలు దీని బారిన కూడా పడ్డారు, వారిలో అమెరికన్ ప్రొఫెషనల్ బాస్కెట్‌బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ పేరు కూడా ఉంది.

 ట్విట్టర్ ఖాతాలో   బ్లూ టిక్‌తో 'అఫిషియల్' అనే పేరు క్రింద కనిపిస్తుంది అని కంపెనీ తెలిపింది. అయితే కొత్త ఫీచర్ 'అఫిషియల్'ను కొద్ది గంటల్లోనే ట్విట్టర్ ఉపసంహరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా దేశంలోని ప్రముఖ రాజకీయ అండ్ క్రీడా ప్రముఖుల ట్విట్టర్ ప్రొఫైల్‌లలో అఫిషియల్ లేబుల్ టిక్‌తో కనిపించింది. వీరిలో నరేంద్ర మోదీతో పాటు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, మరికొందరు ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలు ప్రభుత్వ శాఖలు, మంత్రులతో పాటు బుధవారం సాయంత్రం టెండూల్కర్ కూడా ఉన్నారు. 

 ద్వేషపూరిత ప్రసంగ ట్వీట్లు 3 రెట్లు పెరిగాయి
 ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుండి ద్వేషపూరిత ప్రసంగాలు పెరిగాయని ఒక నివేదిక  తెలిపింది.  

  పరిశోధకుల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 80,000 ఆంగ్ల భాషా ట్వీట్లు మరియు రీట్వీట్‌లను పరిశీలించారు, ఇందులో అభ్యంతరకరమైన పదాలు విస్తృతంగా ఉపయోగించబడ్డాయి. ట్రెండింగ్ పేజీలో ద్వేషపూరిత ప్రసంగాల సంఖ్యను తగ్గించడంలో ట్విట్టర్ విజయవంతమైందని, అయితే అసలైన ద్వేషపూరిత ట్వీట్ల సంఖ్య పెరిగిందని ట్విట్టర్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్ జోయెల్ రోత్ పేర్కొన్నారు. 

నలుగురు అధికారులు రాజీనామా 
ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుండి చాలా గందరగోళం కొనసాగుతోంది. అలాగే కొన్ని రాజీనామాలు కూడా జరిగాయి. రాజీనామా చేసిన వారిలో ట్విటర్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ లీ కిస్నర్, చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డామియన్ కీరన్, చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్ మారియన్ ఫోగెర్టీ ఉన్నారు. వీరితో పాటు ట్విటర్  మోడరేషన్ అండ్ సేఫ్టీ చీఫ్ యోల్ రోత్ కూడా రాజీనామా చేశారు.  

click me!