మళ్ళీ పెరుగుతున్న బంగారం, వెండి ధరలు.. నేడు 10గ్రాముల ధర ఎంత పెరిగిందో తెలుసుకోండి..

By asianet news teluguFirst Published Nov 12, 2022, 10:13 AM IST
Highlights

హైదరాబాద్‌లో కూడా నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.47,810కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర స్వల్ప పెరుగుదతో రూ.52,160కు చేరుకుంది.

పండుగ సీజన్ ముగియడంతో బంగారం ధరలు మరోసారి ఊపందుకున్నాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం ధరతో పోలిస్తే నేటికీ బంగారం ధరలు తక్కువగానే ఉన్నాయి. అయితే దీపావళి తర్వాత బంగారం ధరలు ఎగిశాయి.  IBJA రేట్ల ప్రకారం, గత వారంతో పోలిస్తే ఈ వారం బంగారం ధరలు పెరిగాయి. 

నేడు నవంబర్ 12న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 52,280 కాగా, 22 క్యారెట్ల (10 గ్రాములు) ధర రూ.47,890.   

 వివిధ మెట్రో నగరాల్లో పసిడి  ధరలలో ఈ రోజు హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.52,285 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.47,927గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 52,360 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) ధర రూ. 48,000. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 52,150 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 47,800. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.52,150 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.47,800గా ఉంది.

హైదరాబాద్‌లో కూడా నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 పెరిగి రూ.47,810కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర స్వల్ప పెరుగుదతో రూ.52,160కు చేరుకుంది.  హైదరాబాద్‌లో  నేడు కేజీ వెండి ధర రూ.300 పెంపుతో రూ.67,800కి చేరుకుంది.

click me!