ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్ సేవలు డౌన్ అయ్యాయి. తమ ట్వీట్లు కనిపించడం లేదని పలువురు యూజర్లు కంప్లైంట్ చేస్తున్నారు. స్క్రీన్ షాట్స్ తీసి ఎలాన్ మస్క్ ను ఆట పట్టిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ట్విట్టర్ డౌన్ అయింది. వేలాది మంది వినియోగదారులు ట్విట్టర్ సేవలను యాక్సెస్ చేయలేకపోతున్నారు. ఇదే అంశంపై అటు పలువురు యూజర్లు ట్విట్టర్‌లో ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. మైక్రో-బ్లాగింగ్ సైట్‌లో #TwitterDown పేరిట ఓ హ్యాష్ టాగ్ కూడా ట్రెండ్ అవుతోంది. ఈ ట్యాగ్ ఉపయోగించి వినియోగదారులు తమ సమస్యలను చెబుతున్నారు. చాలా మంది యూజర్లు తమ ట్విట్టర్ పనిచేయడం గగ్గోలు పెడుతున్నారు. , 'ట్విటర్ డౌన్ అయిందని' వినియోగదారులు మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ట్వీట్‌లు లోడ్ కావడం లేదనే స్క్రీన్ షాట్లతో ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో చూపిస్తున్నారు. Twitter తరచుగా ఇలా సర్వీసు డౌన్ అవడం అటు యూజర్లలో కలవరానికి గురి చేస్తోంది. ఎలాన్ మస్క్ సీఈవో అయిన తర్వాత ట్విట్టర్ ఇలాంటి సమస్యలను పలుమార్లు ఎదుర్కొందని చెబుతున్నారు.
Elon Musk trying to fix twitter. pic.twitter.com/8al6GZZu7y
— 👑Che_ಕೃಷ್ಣ🇮🇳 (@ChekrishnaCk)Twitter Down Elon Musk✨ pic.twitter.com/xvmBeBWnzw
— Vishwajeet Pathak (@24VishwaIndia)