
Twitter Deal on hold says Elon Musk: టెస్లా అధినేత, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్ ట్విట్టర్ డీల్ ఇంకా హోల్డ్‌లో ఉందంటూ షాక్ ఇచ్చాడు. ట్విట్టర్ కంపెనీ కోసం తన 44 బిలియన్ల డీల్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మస్క్ ట్వీట్ చేశాడు. ఇందుకు కారణం చెబుతూ, ట్విట్టర్ లో స్పామ్ నకిలీ ఖాతాలు భారీగా ఉన్నాయని పేర్కొన్నాడు. మస్క్ తెలిపిన వివరాల ప్రకారం, స్పామ్/నకిలీ ఖాతాలు వాస్తవానికి మొత్తం వినియోగదారులలో 5 శాతం కంటే తక్కువగా ఉన్నాయని వివరాలు వెలువడిన కాసేపటికే Twitterతో ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. దీంతో ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 20 శాతం వరకు పడిపోయాయి. అయితే ఈ విషయంపై ట్విట్టర్ ఇంకా స్పందించలేదు.
మొదటి త్రైమాసికంలో రోజువారీ యాక్టివ్ యూజర్స్ లో స్పామ్ ఖాతాలు 5 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు కంపెనీ ఈ నెల ప్రారంభంలో అంచనా వేసింది. అదే సమయంలో, ఈ ప్లాట్‌ఫారమ్ నుండి 'స్పామ్ బాట్‌లను' తొలగించడమే తన తొలి ప్రాధాన్యత అని ఎలోన్ మస్క్ తెలిపారు. ఈ నేపథ్యంలో డీల్ తాత్కాలికంగా నిలిపివేయడం పట్ల మార్కెట్లో ఆందోళన నెలకొని ఉంది.
ఆది నుంచి వివాదమే...
ఎలోన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు గురించి చర్చ తెరపైకి వచ్చినప్పటి నుండి, ఈ డీల్ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తొలుత మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించిన సంచలనం రేపాడు. అంతే కాదు ఈ డీల్ త్వరలో పూర్తవుతుందని తెలిపాడు.
ఇద్దరు ఉద్యోగుల తొలగింపు...
ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేయడంతో ట్విట్టర్ బోర్డు గందరగోళంలో పడింది. ట్విట్టర్ కు చెందిన ఇద్దరు సీనియర్ ఉద్యోగులను తొలగించాడు. తొలగించబడిన ఇద్దరు ఉద్యోగులలో ట్విటర్ జనరల్ మేనేజర్ కైవాన్ బాకోర్ మరియు కంపెనీ రెవెన్యూ మరియు ప్రొడక్ట్ హెడ్ బ్రూస్ ఫాక్ ఉన్నారు.
50,000 కోట్ల నిధుల సమీకరణ...
పెట్టుబడిదారుల సమూహం నుండి 50 వేల కోట్ల రూపాయలకు పైగా సమీకరించడంలో మస్క్ విజయం సాధించింది. ఈ ఫండ్ మొత్తం 19 మంది పెట్టుబడిదారుల నుండి సేకరించబడింది. మస్క్ పెట్టుబడి ప్రతిపాదనలో భాగమైన పెట్టుబడిదారులలో ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ కూడా ఉన్నారు. అదనంగా, సౌదీ క్రౌన్ ప్రిన్స్ అల్వలీద్ బిన్ తలాల్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్సౌద్ మస్క్‌కు మద్దతుగా ట్విట్టర్ షేర్లను కొనుగోలు చేయడానికి 35 మిలియన్ డాలర్లకు హామీ ఇచ్చారు.
44 బిలియన్ల ఒప్పందం
ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు ఈ డీల్ విలువ 44 బిలియన్ డాలర్లు. మస్క్ ఈ ఒప్పందాన్ని పూర్తి చేయడానికి, ట్విట్టర్ పేరుతో 13 బిలియన్ల రుణం కోసం ఏర్పాట్లు చేసుకున్నారు, అలాగే టెస్లా స్టాక్స్‌పై 12.5 బిలియన్ల మార్జిన్ రుణం ఏర్పాటు చేసుకున్నాడు, మిగిలిన మొత్తాన్ని మస్క్ తన జేబులో నుంచి ఖర్చు చేయనున్నాడు.
ఈ 13 బిలియన్ల రుణం 2022 సంవత్సరానికి Twitter అంచనా వేసిన EBITDA కంటే 7 రెట్లు ఎక్కువ. ఏప్రిల్ 14న మస్క్ తన ఆఫర్‌ను ట్విట్టర్‌కు అందించగా, ఏప్రిల్ 21న మస్క్ బ్యాంకులకు రుణం కావాలని దరఖాస్తు చేయగా, అందుకు అనుమతి లభించింది. ఆ తర్వాతే ట్విట్టర్ డీల్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది.