
దేశంలోనే అతిపెద్ద IPO షేర్ కేటాయింపు పూర్తయింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, షేర్ల IPO ధర ఎగువ శ్రేణిలో అంటే రూ. 949లో కేటాయింపు జరిగిందనే వార్తలు వస్తున్నాయి. ఎల్‌ఐసీ మే 17న మార్కెట్‌లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఐపీఓ ద్వారా ప్రభుత్వం దాదాపు రూ.20,500 కోట్లు సమీకరించింది.
LIC IPO ప్రైస్ రేంజ్ రూ. 902-949 మధ్యలో ఉంది. దీనికి సంబంధించిన బిడ్డింగ్ మే 9న ముగిసింది. మే 12న దీని అలాట్ మెంట్ జరిగింది. ఇక మే 17న జరిగే లిస్టింగ్ కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. అయితే, గ్రే మార్కెట్ ప్రకారం చూస్తుంటే ఎల్ఐసీ గ్రాండ్ లిస్టింగ్ అయ్యే అవకాశం కనబడటం లేదు.
LIC గ్రే మార్కెట్ ధర ఎంత
మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఎల్‌ఐసి గ్రే మార్కెట్ ధర రూ.25 డిస్కౌంట్ లో నడుస్తోంది. అంటే ఎల్‌ఐసి ఇష్యూ ధర నుండి రూ. 25 నష్టానికి లిస్ట్ అయ్యే అవకాశం ఉందని సూచిస్తోంది. గతంలో IPO తెరవడానికి ముందు గ్రే మార్కెట్ లో దీని షేర్లు రూ. 92 ప్రీమియంతో అందుబాటులో ఉన్నాయి. గత 10 రోజుల్లో దీని GMP దాదాపు 125 శాతం పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు బేరిష్‌గా మారుతున్న తరుణంలో ఎల్‌ఐసీ ఐపీఓ వచ్చిందని, ఇది ప్రతికూలంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ, GMP అనేది ఓ అంచనా మాత్రమే అని, దాని ఆధారంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేమని నిపుణులు సలహా ఇస్తున్నారు.
షేర్ కేటాయింపును ఎలా తనిఖీ చేయాలి
>> మీరు www.kfintech.com లేదా BSE వెబ్‌సైట్‌లో మీ కేటాయింపును తనిఖీ చేయవచ్చు.
>> kfintech వెబ్‌సైట్‌లో IPO కేటాయింపు స్థితిని తనిఖీ చేయడానికి, ముందుగా మీరు దాని వెబ్‌సైట్‌కి వెళ్లి LIC IPO ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
>> ఆ తర్వాత అప్లికేషన్ నంబర్, క్లయింట్ ID లేదా PAN ID నుండి ఏదైనా ఒక మోడ్‌ని ఎంచుకోండి.
>> అప్లికేషన్ రకంలో, ASBA ఎంచుకోండి. ఇప్పుడు మీరు ఎంచుకున్న మోడ్ వివరాలను పూరించండి. ఆ తర్వాత క్యాప్చా నింపి సబ్మిట్ చేయండి.
>> BSE వెబ్‌సైట్‌లో ఇష్యూ టైప్‌కి వెళ్లి ఈక్విటీపై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇష్యూ పేరులో ఎల్‌ఐసి ఇండియా లిమిటెడ్‌ను ఎంచుకోండి. ఇప్పుడు అప్లికేషన్ నంబర్‌ను నమోదు చేయండి.
>> దీని తర్వాత, పాన్ కార్డ్‌ని జోడించి, I am not a robotపై క్లిక్ చేయడం ద్వారా సమర్పించండి. మీకు షేర్ల అలాట్ మెంట్ జరగకపోతే, మీ డబ్బు మొత్తం శుక్రవారం రిజిస్టర్డ్ బ్యాంక్ ఖాతాలోకి తిరిగి వస్తుంది.