spam calls 10 Lakh fine స్పామ్ కాల్స్‌కి రూ.10 లక్షల ఫైన్.. టెలికాం కంపెనీల లబోదిబో!

Published : Feb 13, 2025, 10:34 AM IST
spam calls 10 Lakh fine స్పామ్ కాల్స్‌కి రూ.10 లక్షల ఫైన్.. టెలికాం కంపెనీల లబోదిబో!

సారాంశం

స్పామ్ కాల్స్, మెసేజెస్ తో విసిగిపోయిన వారికి ఉపశమనం కలిగించే వార్త. వీటిని అడ్డుకోవడానికి ట్రాయ్ కొత్త నిబంధన తీసుకొచ్చింది.

స్పామ్ కాల్స్: లోన్ ఆఫర్స్, డొనేషన్స్ లాంటివి అడుక్కుంటూ వచ్చే స్పామ్ కాల్స్ చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ట్రాయ్ (TRAI) వీటిని అరికట్టేందుకు కొత్త రూల్స్ ప్రకటించింది. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే 2 లక్షల నుండి 10 లక్షల వరకు జరిమానా విధించనుంది. స్పామ్ కాల్స్ గురించి తప్పుడు సమాచారం ఇచ్చే టెలికాం కంపెనీలపై ఈ జరిమానా పడుతుంది.

ట్రాయ్ ఆదేశం: స్పామర్లను వెంటనే గుర్తించాలి

అధిక కాల్ వాల్యూమ్, చిన్న కాల్ డ్యూరేషన్, తక్కువ ఇన్‌కమింగ్- అవుట్‌గోయింగ్ కాల్ రేషియో లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కాల్, SMS ప్యాటర్న్‌లను విశ్లేషించాలని ట్రాయ్ టెలికాం ఆపరేటర్లకు సూచించింది. స్పామర్లను వెంటనే గుర్తించాలని ఆదేశించింది.

తప్పుడు రిపోర్టింగ్ ఇస్తే జరిమానా ఖాయం

స్పామర్లను గుర్తించకపోవడం, స్పామ్ కాల్స్‌ను అడ్డుకోకపోవడం లాంటి వాటిపై టెలికాం ఆపరేటర్లపై చర్యలు తీసుకుంటారు. తప్పుడు రిపోర్టింగ్ ఇస్తే మొదటిసారి 2 లక్షలు, రెండోసారి 5 లక్షలు, ఆ తర్వాత ప్రతిసారి 10 లక్షల జరిమానా విధిస్తారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Home Loan: ఇల్లు కొంటున్నారా? తక్కువ వడ్డీతో హోమ్ లోన్ ఇచ్చే బ్యాంకులు ఇవిగో
Personal Loan: శాలరీ స్లిప్ లేకుండా వెంటనే పర్సనల్ లోన్.. ఈ పత్రాలతో గంటల్లో అప్రూవల్ !