రికార్డు బ్రేక్ చేస్తున్న బంగారం ధరలు..10గ్రాములకు ఎంతంటే..?

By Sandra Ashok KumarFirst Published Jun 22, 2020, 12:34 PM IST
Highlights

కరోనా వైరస్ కేసుల పెరుగుదల,  చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాల కారణంగా బంగారం ధరలు నేడు ఒక నెల గరిష్టాన్ని చేరింది. ఆసియా ట్రేడింగ్‌లో నేటి ఉదయం సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 22 డాలర్ల లాభపడి 1,775.05 డాలర్ల స్థాయికి చేరుకుంది. వెండి  ధర 1% పెరిగి 17.78కు, ప్లాటినం 0.7% పెరిగి 811.10 డాలర్లకు చేరుకుంది.

భారతదేశంలో బంగారం ధరలు ఈ రోజు లాభాలను పెంచాయి, ప్రపంచ ర్యాలీ మధ్య కొత్త గరిష్టాన్ని తాకింది. ఎం‌సి‌ఎక్స్ లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.7% పెరిగి బంగారం ధర రూ.48,289 కు చేరుకుంది. బంగారం, వెండి కూడా బలమైన లాభాలను నమోదు చేసింది.

ఎంసిఎక్స్ వెండి ఫ్యూచర్స్ కిలోకు 1.2% పెరిగి వెండి ధర కిలోకు రూ.49,190 కు చేరుకుంది. అంతకుముందు బంగారం ధర 1.2%, వెండి ధర 1.5% పెరిగాయి. పసిడి ధర గతవారం రూ.47937 ఉండగా నేడు  రూ.300లు లాభపడి రూ.48237 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

కరోనా వైరస్ కేసుల పెరుగుదల,  చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాల కారణంగా బంగారం ధరలు నేడు ఒక నెల గరిష్టాన్ని చేరింది. ఆసియా ట్రేడింగ్‌లో నేటి ఉదయం సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 22 డాలర్ల లాభపడి 1,775.05 డాలర్ల స్థాయికి చేరుకుంది. వెండి  ధర 1% పెరిగి 17.78కు, ప్లాటినం 0.7% పెరిగి 811.10 డాలర్లకు చేరుకుంది.

also read 

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 1,83,020 పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌ఓ ఆదివారం తెలిపింది. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున కొన్ని యు.ఎస్ స్టోర్లను తాత్కాలికంగా మూసివేస్తామని ఆపిల్ శుక్రవారం తెలిపింది.

రాజకీయ, ఆర్థిక అనిశ్చితి కాలంలో బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా ఇన్వెస్టర్లు ఉపయోగిస్తారు. రిస్క్-రివర్స్ సెంటిమెంట్ సూచిక ద్వారా ప్రపంచంలోని అతిపెద్ద బంగారు-మద్దతుగల ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ (ఇటిఎఫ్), ఎస్పిడిఆర్ గోల్డ్ ట్రస్ట్, గురువారం 1,136.22 టన్నుల నుండి 2.03% పెరిగి 1,159.31 టన్నులకు చేరుకుంది.

ప్రధాన ఆసియా కేంద్రాలలో బంగారం రిటైల్ ఫిజికల్ డిమాండ్ తగ్గిపోయిందని, అయితే ధరలు పెరగడంతో మార్కెట్  కోలుకుంటుంది  అనే అంచనాలు ఉన్నాయి. దేశీయ బంగారం ధరలలో 12.5% ​​దిగుమతి పన్ను, 3% జీఎస్టీ ఉన్నాయి.
 

click me!