తగ్గిన బంగారం, వెండి ధరలు...కరోనా కేసులే ఇందుకు కారణం...

By Sandra Ashok KumarFirst Published Jun 15, 2020, 6:20 PM IST
Highlights

చైనా రాజధాని బీజింగ్‌లో మరోసారి కరోనా వైరస్‌ కేసులు నమోదవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల భారీ పతనాన్ని అడ్డుకుందని, అమెరికా సహా పలు దేశాల్లో పాజిటివ్‌ కేసులు మరింత పెరగడం వల్ల బంగారానికి ఊతంగా నిలిచాయని బులియన్‌ ట్రేడర్లు అంచనా వేశారు.
 

ఆర్థిక వ్యవస్థను తిరిగి చక్కబెట్టడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని ప్రకటించడంతో రిస్క్ సెంటిమెంట్ మెరుగుదల మధ్య భారత మార్కెట్లలో ఈ రోజు బంగారం ధరలు గణనీయంగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరలు పడిపోవడంతో దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు కూడా తగ్గాయి.

ముంబై ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 576 రూపాయలు తగ్గి 46,758 రూపాయలకు చేరుకుంది, కిలో వెండి 733 రూపాయలు తగ్గి 46,957 రూపాయలు పలికింది. 

ఎం‌సి‌ఎక్స్ లో బంగారు ఫ్యూచర్స్ ధర 10 గ్రాముకు 0.7% తగ్గి 46,369 డాలర్లకు చేరుకుంది. ఎం‌సి‌ఎక్స్ లో బంగారం, వెండి ఫ్యూచర్స్ కూడా బాగా క్షీణించి 10 గ్రాముల వెండి ధర 0.8% పడిపోయి 48,402 కు చేరుకుంది.

also read చైనాలో మళ్లీ కరోనా కేసులు.. క్రూడ్ ఆయిల్ ధరలకు షాక్‌...

అంతకు ముందు వెండి ధర 0.64% పెరిగింది. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, హోటళ్ళు, కార్యాలయాలు తేరవడానికి ఆరోగ్య నిర్వహణ విధానాలను అనుసరించాలీ అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసింది.

చైనా రాజధాని బీజింగ్‌లో మరోసారి కరోనా వైరస్‌ కేసులు నమోదవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల భారీ పతనాన్ని అడ్డుకుందని, అమెరికా సహా పలు దేశాల్లో పాజిటివ్‌ కేసులు మరింత పెరగడం వల్ల బంగారానికి ఊతంగా నిలిచాయని బులియన్‌ ట్రేడర్లు అంచనా వేశారు.

స్పాట్ బంగారం ధర 0.2 శాతం పెరిగి ఔన్సుకు 1,714.78 డాలర్లు చేరుకుంది. డాలర్ సూచీ ఈ వారంలో 1.5% పైగా పడిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ ఎస్‌పిడిఆర్ గోల్డ్ ట్రస్ట్ గురువారం 0.1 శాతం తగ్గి 1,132.21 టన్నులకు చేరుకుంది. ప్లాటినం ధర నేడు 0.4% పెరిగి 40,840.39 కు చేరుకుండీ.
 

click me!