పెట్రోల్ ధ‌ర‌ల‌పై పిటిష‌న్ ‌.. వార్నింగ్ ఇచ్చిన సుప్రీంకోర్టు

Ashok Kumar   | Asianet News
Published : Sep 08, 2020, 02:33 PM ISTUpdated : Sep 08, 2020, 11:39 PM IST
పెట్రోల్ ధ‌ర‌ల‌పై పిటిష‌న్ ‌.. వార్నింగ్ ఇచ్చిన సుప్రీంకోర్టు

సారాంశం

 ఇంధన ధరలు  రోజువారీగా పెంచడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించేందుకు మంగళవారం తిర‌స్క‌రించింది. అయితే పిటిషనర్  త‌ర‌పున వాదించిన కౌన్సిల్‌కు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. 

న్యూ ఢీల్లీ: పెట్రోల్ ధరలు రోజురోజుకి  పెరుగుతుండటంతో ధ‌ర‌ల నియంత్ర‌ణ కోరుతూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. ఇంధన ధరలు  రోజువారీగా పెంచడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించేందుకు మంగళవారం తిర‌స్క‌రించింది.

అయితే పిటిషనర్  త‌ర‌పున వాదించిన కౌన్సిల్‌కు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఈ పిటిష‌న్‌పై మీరు వాదిస్తే, స‌దరు వ్య‌క్తి పిటిషన్ దాఖలు చేసినందుకు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పిటిషనర్‌ను ఉన్నత కోర్టు హెచ్చరించింది.

also read ఆ విమాన టిక్కెట్లకు డబ్బులు పూర్తిగా రిఫుండ్ చేస్తాం : డిజిసిఎ ...

దీంతో త‌న పిటిష‌న‌ర్ త‌ర‌పున‌ పిల్‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు న్యాయ‌వాది చెప్పారు. జస్టిస్ ఆర్.ఎఫ్. నరిమన్, నవీన్ సిన్హా, ఇందిరా బెనర్జీతో కూడిన ధర్మసనం  "మీరు ఈ కేసును వాదించాలనుకుంటున్నారా, ఎందుకంటే ఒకవేళ మీరు అలా చేస్తే, మేము భారీ జరిమానా ఉంటుందని" తెలిపింది.

పిటిషనర్ షాజీ జె కోదన్‌కందత్ తరఫున హాజరైన న్యాయవాది ధర్మాసనం ముందు ఈ పిఐఎల్‌ను సమర్పించారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని పిటిషనర్ కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై విచారణ తరువాత, సుప్రీం కోర్టు ఈ పిల్‌ను కొట్టివేసింది.  

PREV
click me!

Recommended Stories

Electric Scooter: లక్ష మంది కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది.. ఓలాకు చుక్కలు చూపించింది
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !