సంక్రాంతి తరువాత మళ్ళీ పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు కాస్త దిగోచ్చాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం ధర ఈ రోజు మాత్రం కాస్త దిగొచ్చింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది కొంత ఊరట కలిగిస్తుంది. బంగారం ధరతో పాటు వెండి ధర కూడా కలిసొచ్చింది.
గత కొద్దిరోజులుగ బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. బంగారం కొనలంటేనే ప్రజలు ఆలోచించేల ధరలు తార స్థాయికి చేరుకున్నాయి. బంగారం ఇంకా పెరగొచ్చు ఏమో అనే వార్తలు కూడా బంగారం ధరల అంచనాలను కూడా పెంచాయి. సంక్రాంతి తరువాత మళ్ళీ పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు కాస్త దిగోచ్చాయి.
నిన్న భారీగా పెరిగిన బంగారం ధర ఈ రోజు మాత్రం కాస్త దిగొచ్చింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది కొంత ఊరట కలిగిస్తుంది. బంగారం ధరతో పాటు వెండి ధర కూడా కలిసొచ్చింది. అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడంతో ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా పడింది. దీంతో బంగారం ధర క్షీణించింది, అంతేకాకుండా అధిక ధరల నేపథ్యంలో దేశీ జువెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ తగ్గడం కూడా బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపింది.
also read ఫోటోలు లీక్:అమెజాన్ సిఈఓ పై అతని గర్ల్ ఫ్రెండ్ సోదరుడి దావా...
చైనా సెంట్రల్ బ్యాంక్ తాజాగా రివర్స్ రెపో రేటును తగ్గించింది. కరోనా వైరస్ దెబ్బతో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చైనా సెంట్రల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్ల తగ్గింపుతో మార్కెట్‌లో లిక్విడిటీ పెరగనుంది. దీంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడింది. అంతేకాకుండా అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్ గణాంకాలు అంచనాలు మించి నమోదు కావడం వల్ల కూడా బంగారం ధర తగ్గిందని నిపుణులు పేర్కొన్నారు.
గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధర కాస్త తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.73 శాతం తగ్గుదలతో 1576.50 డాలర్లకు క్షీణించింది. వెండి ధర ఔన్స్‌కు 2.30 శాతం క్షీణతతో 17.58 డాలర్లకు తగ్గింది.హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగళవారం రూ.120 తగ్గింది. దీంతో బంగారం ధర రూ.39,230 నుంచి రూ.39,110కు పడిపోయింది. 24 క్యారెట్ల బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90 తగ్గుదలతో రూ.42,760 నుంచి రూ.42,670కు తగ్గింది.
బంగారం ధరతో పాటు వెండి ధర కూడా భారీగా పడిపోయింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.990 కిందకు చేరింది. దీంతో వెండి ధర రూ.49,990 నుంచి రూ.49,000కు చేరుకుంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ క్షీణించడం ఇందుకు ప్రధాన కారణం.దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 క్షీణించింది. దీంతో ధర రూ.39,950కు తగ్గింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.60 తగ్గుదలతో రూ.41,150కు క్షీణించింది. ఇక కేజీ వెండి ధర రూ.990 పతనమై రూ.49,000కు పడిపోయింది.
బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.రానున్న కాలంలో పసిడి రేటు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు అంటున్నారు.
also read కరోనా వైరస్ దెబ్బకు చైనా స్టాక్ మార్కెట్లు విలవిల
అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే ఆ అంశం కూడా పసిడి మెరుపులకు కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంచనా వేస్తున్నారు.
దేశీ మార్కెట్‌లో బంగారం ధర 2019లో ఏకంగా 25 శాతానికి పైగా పరుగులు పెట్టింది. బంగారంపై దిగుమతి సుంకాల పెంపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర పరుగులు పెట్టడం వంటి పలు అంశాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.