పెట్రోల్ తో పాటు సెంచరీకి చేరువలో డీజిల్ ధరలు.. నేడు రికార్డు స్థాయికి మళ్ళీ పెరిగిన ఇంధన ధరలు..

By asianet news teluguFirst Published Jun 14, 2021, 10:59 AM IST
Highlights

ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను మళ్ళీ పెంచాయి. నేడు డీజిల్ ధర గరిష్టంగా 30 నుంచి 31 పైసలు పెరగగా, పెట్రోల్ ధర కూడా 28 నుంచి 29 పైసలు పెరిగింది. 
 

గత కొద్దిరోజులుగా సామాన్యులపై ఇంధన భారం పెరుగుతూనే ఉంది. దీంతో చివరి వారంలో రికార్డు స్థాయిని తాకిన ఇంధన ధరలు నేడు తాజా పెంపుతో తార స్థాయికి చేరాయి. చమురు రిటైలర్ల ధర నోటిఫికేషన్ ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరలపై నేడు సోమవారం 29 నుంచి 31 పైసల వరకు పెంచారు.


తాజా పెరుగుదల తరువాత, ఢీల్లీలో ఒక లీటరు పెట్రోల్ రూ.96.4, డీజిల్ ధర రూ.87.28. ముంబైలో పెట్రోల్ లీటరుకు రూ.102.58, డీజిల్ లీటరుకు రూ. 94.70 చేరింది. కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటరుకు రూ.96.34, డీజిల్ లీటరుకు రూ.90.12కు పెరిగింది.  చెన్నైలో పెట్రోల్‌కు లీటరుకు  రూ.97.69, డీజిల్‌ రూ. 91.92 గా సవరించారు.

also read 

భోపాల్‌లో పెట్రోల్‌ ధర లీటరుకు  రూ.104.59 & డీజిల్‌కు రూ.95.91 / లీటర్‌కు విక్రయిస్తున్నారు. లడఖ్‌లో పెట్రోల్ లీటరుకు రూ.101.95,  డీజిల్‌ ధర  రూ.93.90 / లీటరుకు చేరింది.హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.100.20, డీజిల్ ధర రూ.95.14.

మొట్టమొదటిసారి డీజిల్ ధరలు కూడా శనివారం  రూ.100 మార్కును అధిగమించాయి. భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లాలో డీజిల్ ధర శనివారం తొలిసారిగా రూ.100 మార్కును దాటింది. ఫిబ్రవరి మధ్యలో పెట్రోల్ ధర లీటరుకు రూ.100 తాకిన దేశంలో మొదటి నగరం  శ్రీ గంగానగర్.

మే 29న ముంబైలో లీటరు పెట్రోల్ రూ.100 పైగా విక్రయిస్తున్న దేశంలోని మొదటి మెట్రో నగరంగా అవతరించింది. వ్యాట్ లేదా సరుకు రవాణా ఛార్జీలు వంటి స్థానిక పన్నుల కారణంగా రాష్ట్రాలలో ధరల వ్యత్యాసం ఉంటుంది. దేశంలో పెట్రోల్, డీజిల్‌పై రాజస్థాన్ అత్యధిక వ్యాట్ వసూలు చేస్తుంది, తరువాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.
 

click me!