పెట్రోల్, డీజిల్ ధరలు నేడు మళ్ళీ పెంపు...లీటరు ఎంతంటే ?

Ashok Kumar   | Asianet News
Published : Jun 29, 2020, 11:31 AM ISTUpdated : Jun 29, 2020, 11:20 PM IST
పెట్రోల్, డీజిల్ ధరలు నేడు మళ్ళీ పెంపు...లీటరు ఎంతంటే ?

సారాంశం

కేవలం మూడు వారాల్లో వరుసగా 22వ సారి ఇంధన ధరలను సవరించారు. రాష్ట్ర చమురు మార్కెటింగ్ సంస్థల ధరల నోటిఫికేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర లీటరుకు 5 పైసలు, డీజిల్ 13 పైసలు పెంచింది. 

న్యూ ఢీల్లీ: ఒకరోజు విరామం తరువాత ఇంధన ధరలు మళ్ళీ ఊపందుకున్నాయి. సోమవారం రోజు పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపనీలు వరుసగ మళ్ళీ పెంచాయి. కేవలం మూడు వారాల్లో వరుసగా 22వ సారి ఇంధన ధరలను సవరించారు.

రాష్ట్ర చమురు మార్కెటింగ్ సంస్థల ధరల నోటిఫికేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర లీటరుకు 5 పైసలు, డీజిల్ 13 పైసలు పెంచింది. ఢీల్లీలో లీటరు పెట్రోల్ ఇప్పుడు 80.43 రూపాయలకు చేరింది. డీజిల్ ధరను రూ .80.40 నుండి లీటరుకు రూ .80.53కు పెంచారు.

also read పసిడి ధరలు తారాజూవ్వల్లా...దీపావళి కల్లా తులం బంగారం ఎంతంటే..? ...

ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ .87.14 నుంచి రూ .87.19 కు, డీజిల్‌ లీటరుకు రూ .78.7 నుంచి రూ .78.83 కు పెంచింది. కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటరుకు రూ .82.10 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ .75.64 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు రూ .83.63, డీజిల్ ధర లీటరుకు రూ .77.72 గా ఉంది.

లాక్ డౌన్ తరువాత జూన్ 7 నుండి డీజిల్ ధరలను వరుసగా 22వ సారి పెంచగా, 21వ సారి  పెట్రోల్ ధరను పెంచాయి. చమురు కంపెనీలు జూన్ 7 నుంచి ఇంధన ధరలను పెంచుతూ వస్తున్నాయి. లాక్ డౌన్ తరువాత మొత్తం పెట్రోల్‌పై రూ .9.17, డీజిల్‌లో రూ .11.14 గా పెరిగింది. హైదరబాద్ లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 82.59 ఉండగా డీజిల్ ధర 78.57.
 

PREV
click me!

Recommended Stories

Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !
Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్