తగ్గిన ఇంధన ధరలు.. ఈ నెలలో పెట్రోల్ పై 7 సార్లు, డీజిల్ పై 15 సార్లు తగ్గింపు..

Ashok Kumar   | Asianet News
Published : Sep 26, 2020, 02:11 PM ISTUpdated : Sep 26, 2020, 10:24 PM IST
తగ్గిన ఇంధన ధరలు.. ఈ నెలలో పెట్రోల్ పై 7 సార్లు, డీజిల్ పై 15 సార్లు తగ్గింపు..

సారాంశం

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ ప్రకారం, ఢీల్లీలో డీజిల్ ధర లీటరుకు 16 పైసలు తగ్గింది. సవరించినా డీజిల్ ధరతో  లీటరుకు రూ.71.10 నుండి రూ.70.94 పడిపోయింది.

రెండు రోజుల తరువాత శనివారం ఇంధన ధరలు దిగోచ్చాయి. నేడు దేశంలోని అన్ని మెట్రో నగరాలలో వరుసగా రెండవ రోజు కాస్త డీజిల్ ధరలు తగ్గాయి. మరోవైపు  మెట్రో నగరాలలో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ ప్రకారం, ఢీల్లీలో డీజిల్ ధర లీటరుకు 16 పైసలు తగ్గింది. సవరించినా డీజిల్ ధరతో  లీటరుకు రూ.71.10 నుండి రూ.70.94 పడిపోయింది. పెట్రోల్ ధర శనివారం స్థిరంగా లీటరుకు రూ.81.06 వద్ద ఉంది.

ఢీల్లీలో ఇప్పటివరకు పెట్రోల్ పై రూ.1.02, డీజిల్ పై  రూ.2.36 తగ్గింది. ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి ఇతర మెట్రో నగరాల్లో డీజిల్ ధరపై లీటరుకు 17 పైసలు తగ్గింది. ముంబైలో లీటరు డీజిల్‌ ధర రూ.77.36 ఉంది.

also read యెస్ బ్యాంక్: రానా కపూర్‌కు చెందిన రూ.127 కోట్ల లండన్ ఫ్లాట్‌ ఈడీ జప్తు.. ...

పెట్రోల్ ధర లీటరుకు రూ.87.74 వద్ద స్థిరంగా ఉండగా, డీజిల్ ధర స్వల్పంగా 17 పైసలు పడిపోయింది. దీంతో డీజిల్ రిటైల్ ధర లీటరుకు. 77.36కు చేరుకుంది.

చెన్నైలో లీటరు పెట్రోల్‌కు రూ.84.14, డీజిల్‌ ధర లీటరుకు రూ.76.40. కోల్‌కతాలోని ఇంధన ధరలు పెట్రోల్ లీటరుకు రూ.82.59, డీజిల్‌ ధర  రూ. 74.46 ఉంది. చమురు మార్కెటింగ్ సంస్థలు ఈ నెలలో 15 సార్లు డీజిల్ ధరలను తగ్గించగా, పెట్రోల్ ధరలను 7 సార్లు తగ్గించింది.

స్థానిక పన్నులు, వ్యాట్ కారణంగా ఇంధన ధరలు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రానికి మారుతాయి. భారతదేశంలోని మూడు ప్రధాన చమురు మార్కెటింగ్ సంస్థలు అయిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా సమీక్షిస్తాయి. ఇంధన ధరలలో ఏవైనా సవరణలు ఉంటే ఉదయం 6 గంటల నుండి కొత్త ధరలు అమల్లోకి  తెస్తాయి. 

 హైదరాబాద్ లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.84.25 ఉండగా, డీజిల్ ధర లీటరుకు రూ.74.73 ఉంది.

PREV
click me!

Recommended Stories

New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!
Post office: నెల‌కు రూ. 5 వేలు ప‌క్క‌న పెడితే.. రూ. 8.5 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు