బంగారం కొనేందుకు సరైన సమయయా.. అల్ టైం హై చేరువలో పసిడి.. ఒక్కరోజే ఎంత పెరిగిందంటే?

By asianet news teluguFirst Published Dec 27, 2022, 10:03 AM IST
Highlights

ఒక నివేదిక ప్రకారం 10 గ్రాముల 22 క్యారెట్ల నేటి బంగారం ధర రూ. 49,950, నిన్నటి ముగింపు కంటే రూ. 100 ఎక్కువ. ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లలో 10 గ్రాముల 24 క్యారెట్ల  బంగారం ధర రూ.54,480, 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.49,950గా ఉంది.

నేడు మంగళవారం ప్రారంభ ట్రేడింగ్‌లో బంగారం ధర రూ.100 పెరిగి 10 గ్రాముల పసిడి ధర 24 క్యారెట్లకు రూ.54,480 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధరలో ఈ రోజు ఎలాంటి మార్పు లేదు  దీంతో కిలో ధర రూ.71,100గా ఉంది.

ఒక నివేదిక ప్రకారం 10 గ్రాముల 22 క్యారెట్ల నేటి బంగారం ధర రూ. 49,950, నిన్నటి ముగింపు కంటే రూ. 100 ఎక్కువ. ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌లలో 10 గ్రాముల 24 క్యారెట్ల  బంగారం ధర రూ.54,480, 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.49,950గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,630,  22 క్యారెట్ల  10 గ్రాముల ధర రూ.50,100 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,480, , 22 క్యారెట్ల 10 గ్రాముల ధర  రూ.50,860గా ఉంది.

 చైనాలో పెరుగుతున్న COVID-19 కేసులు ప్రపంచానికి మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి, దీంతో దేశీయ మార్కెట్లో పసిడి ఆల్-టైమ్ హై లెవెల్స్‌కి దగ్గరగా చేరువవుతుంది అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ నిపుణుడు చెప్పారు.

0021 GMT నాటికి స్పాట్ బంగారం 0.3 శాతం పెరిగి ఔన్స్‌కు $1,802.63డాలర్లకి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి $1,810.00డాలర్లకి చేరుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోయి  ప్రస్తుతం రూ82.793 వద్ద ట్రేడవుతోంది.

SPDR గోల్డ్ ట్రస్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్-బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్, దాని హోల్డింగ్స్ గత శుక్రవారం 0.1 శాతం పడిపోయి 913.01 టన్నులకు చేరుకుంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో ప్రస్తుతం 1 కిలో వెండి ధర రూ.71,100గా ట్రేడవుతుండగా,  హైదరాబాద్‌, చెన్నైలో 1 కిలో వెండి ధర రూ.74,000గా ఉంది.స్పాట్ వెండి 0.7 శాతం పెరిగి $23.88డాలర్లకి, ప్లాటినం 0.5 శాతం పెరిగి $1,027.00డాలర్లకి, పల్లాడియం 0.6 శాతం పెరిగి $1,774.00డాలర్లకి చేరుకుంది.

click me!