Today Gold Prices: దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధరలివే..!

By team teluguFirst Published Jan 15, 2022, 10:46 AM IST
Highlights

పసిడి ప్రియులకు కాస్త ఊరటనిచ్చే వార్త ఇది. సంక్రాంతి వేళ బంగారం ధరలో ఏ మార్పు రాలేదు. దేశంలోని వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి.
 

పసిడి ప్రియులకు కాస్త ఊరటనిచ్చే వార్త ఇది. సంక్రాంతి వేళ బంగారం ధరలో ఏ మార్పు రాలేదు. దేశంలోని వివిధ నగరాల్లో నేటి బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్, బులియన్ మార్కెట్ తీరు, డాలర్ విలువ, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం నిల్వలు, వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, ఒమిక్రాన్ తీవ్రత వంటివి బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుంటాయి. గత పది రోజుల్లో బంగారం ధర ఐదు సార్లు పెరగగా, మూడుసార్లు తగ్గింది. రెండు సార్లు మాత్రం స్థిరంగా కొనసాగింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ బంగారం ధర (Gold Price) ఎలా ఉందో తెలుసుకుందాం.

హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర నిలకడగానే కొనసాగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో బంగారం ధర రూ. 49,100 వద్దనే కొనసాగుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ. 45,000 వద్ద స్థిరంగా ఉంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో (Delhi Gold Rate) 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 150 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 51 వేల 440 రూపాయలు ఉంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 47 వేల 300 రూపాయ‌లు ఉంది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 50 వేలుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 45 వేలు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 49 వేల వంద రూపాయలుగా ఉంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 46 వేల 980 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 980 రూపాయలుంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 46 వేల 980 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర 48 వేల 980 రూపాయలుంది. 

click me!