todays petrol diesel prices:వాహనదారులకు ఊరట.. సంక్రాంతి రోజున పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల..

By asianet news teluguFirst Published Jan 15, 2022, 6:44 AM IST
Highlights

దేశంలో ఇంధన ధరలు(fuel prices) నేడు శనివారం స్థిరమైన పరంపరను కొనసాగిస్తున్నాయి. దేశ రాజధానిలో, ఒక లీటర్ పెట్రోల్ ధర రూ. 95.41 కాగా, లీటర్ డీజిల్ రూ. 86.67గా ఉంది. నవంబర్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలపై  కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని(excise duty) తగ్గించడంతో  దిగోచ్చాయి. కేంద్ర ప్రభుత్వం(central government) నవంబర్ 3న పెట్రోల్‌పై లీటరుకు రూ. 5, డీజిల్‌పై రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.  
 

నేడు  శనివారం సంక్రాంతి పండగ సందర్భంగా దేశంలోని  అన్నీ మెట్రో నగరాల్లో వరుసగా 44 రోజుల పాటు ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత నెలలో ఢిల్లీ ప్రభుత్వం పెట్రోల్‌పై వాల్యు ఆధారిత పన్ను(VAT)ను 30 శాతం  నుండి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటరుకు  రూ.8.56 తగ్గింది.

ఈ రోజు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 కాగా, డీజిల్ ధరలు లీటరుకు రూ.86.67గా ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు  అత్యధికంగా రూ.109.98 వద్ద, డీజిల్ ధర లీటరుకు రూ.94.14 వద్ద విక్రయించబడుతోంది. అన్నీ మెట్రో నగరాల్లో కంటే ఇంధన ధరలు  ముంబైలో అత్యధికంగా ఉన్నాయి. మరోవైపు విలువ ఆధారిత పన్ను లేదా వ్యాట్ కారణంగా ప్రతి రాష్ట్రానికి ఇంధన ధరలు మారుతూ ఉంటాయి.

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు శుద్ధి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లలో ముడి చమురు ధరలు, రూపాయి-డాలర్ మారకపు ధరలను పరిగణనలోకి తీసుకుని ప్రతిరోజూ ఇంధన ధరలను సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలులోకి వస్తాయి.

అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్‌తో సహా అనేక అంశాలు ఇంధన రిటైల్ ధరలను ప్రభావితం చేస్తాయి. ఒక నివేదిక ప్రకారం ముడి చమురు ధరలు రెండు రోజుల వరుస లాభాల తర్వాత గురువారం తగ్గుదలని గమనించాయి. బ్రెంట్ క్రూడ్ ధర 6 సెంట్లు లేదా 0.1% తక్కువగా ఉంది, బ్యారెల్ మార్కుకు 84.61 వద్ద ట్రేడవుతోంది, అయితే యూ‌ఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ 7 సెంట్లు తగ్గి, బ్యారెల్‌కు 82.57 డాలర్లకు దగ్గర ఉంది.

ఢిల్లీ పెట్రోలు ధర  లీటరుకు రూ. 95.41, డీజిల్ లీటరుకు రూ. 86.67

చెన్నై పెట్రోలు ధర  లీటరుకు రూ. 101.40, డీజిల్ ధర   లీటరుకు రూ. 91.43

కోల్‌కతా పెట్రోలు ధర  లీటరుకు రూ. 104.67, డీజిల్ ధర  లీటరుకు రూ. 89.79

త్రివేండ్రం పెట్రోలు ధర  లీటరుకు రూ. 106.04, డీజిల్ ధర లీటరుకు రూ. 93.17

హైదరాబాద్ పెట్రోలు ధర లీటరుకు రూ. 108.20, డీజిల్ ధర లీటరుకు రూ. 94.62

బెంగళూరు పెట్రోలు ధర లీటరుకు రూ. 100.58, డీజిల్ ధర లీటరుకు రూ. 85.01

జైపూర్ పెట్రోలు ధర  లీటరుకు రూ. 106.64, డీజిల్ ధర  లీటరుకు రూ. 90.32

లక్నో పెట్రోలు ధర లీటరుకు రూ. 95.28, డీజిల్ ధర లీటరుకు రూ. 86.80

భువనేశ్వర్ పెట్రోలు ధర లీటరుకు రూ. 101.81, డీజిల్ ధర లీటరుకు రూ. 91.62

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలో మార్పు నేరుగా దేశీయ మార్కెట్లో  చమురు ధరను ప్రభావితం చేస్తుంది. భారత దేశీయ మార్కెట్‌లో పెట్రోల్ ధరల పెరుగుదలకు కారణమైన ముఖ్యమైన కారకాల్లో ఇది ఒకటి. అంతర్జాతీయ డిమాండ్ పెరుగుదల, తక్కువ ఉత్పత్తి రేటు అలాగే ప్రపంచంలోని ముడి చమురు ఉత్పత్తి దేశాలలో ఏదైనా రాజకీయ అశాంతి పెట్రోలు ధరను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

భారతదేశం ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆర్థిక వృద్ధి కూడా పెట్రోల్, ఇతర ముఖ్యమైన ఇంధనాలకు డిమాండ్ పెరగడానికి దారితీసింది. భారతదేశంలో పెట్రోలు డిమాండ్ పెరగడానికి ఇటీవలి కాలంలో ప్రైవేట్ వాహనాలను కలిగి ఉన్న వ్యక్తుల సంఖ్య పెరిగింది, దీంతో భారత్‌లో పెట్రోల్ ధరలు పెరిగాయి.

click me!