Gold Price Today : దేశీయ మార్కెట్‌లో నేటి బంగారం ధరలు..!

By team teluguFirst Published Jan 14, 2022, 12:44 PM IST
Highlights

భారతీయులు ఏ చిన్న శుభకార్యమైనా కొద్ది మొత్తంలోనైనా బంగారం కొనుగోలు చేస్తారు. అందుకే బంగారం ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తుంటారు. దేశీయ మార్కెట్‌లో నేటి బంగారం ధరల వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..!
 

దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. గురువారంతో పోలిస్తే ఇవాళ (జనవరి 14) బంగారం ధర రూ.1600 పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,940 ఉండగా.. ఇవాళ అది రూ.47,100కి చేరింది. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. అయితే జీఎస్టీ, టీసీఎస్, ఇతరత్రా పన్నుల కారణంగా స్థానిక ధరల్లో కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చుననే విషయం గమనించాలి.

హైదరాబాద్ మార్కెట్‌లో ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,010గా ఉంది. నిన్నటితో పోలిస్తే కేవలం రూ.10 మేర ధర తగ్గింది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,010గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.90 మేర ధర తగ్గింది. విజయవాడలోనూ ఇంచుమించుగా హైదరాబాద్ మార్కెట్‌లోని ధరలే కొనసాగుతున్నాయి. ఇవాళ విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,010గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,100గా ఉంది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
 

click me!