Today Gold And Silver Price: స్థిరంగా బంగారం ధ‌ర‌లు.. ముఖ్య నగరాల్లో నేటి ధరలివే..!

By team teluguFirst Published Jan 19, 2022, 10:11 AM IST
Highlights

ద్ర‌వ్యోల్బణం వ్యతిరేకంగా బంగారాన్ని కొన్ని ఏళ్లుగా పెట్టుబడిగా భావిస్తున్నారు. పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు. బంగారం ధరపై అంతర్జాతీయంగా ధరలు మార్పుతో పాటు దేశీయ కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వ్, నిలకడ లేని వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, నగల మార్కెట్లు సహా అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయి. 

ద్ర‌వ్యోల్బణం వ్యతిరేకంగా బంగారాన్ని కొన్ని ఏళ్లుగా పెట్టుబడిగా భావిస్తున్నారు. పెట్టుబడిదారులు బంగారాన్ని ఒక ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు. బంగారం ధరపై అంతర్జాతీయంగా ధరలు మార్పుతో పాటు దేశీయ కేంద్ర బ్యాంకుల బంగారం రిజర్వ్, నిలకడ లేని వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, నగల మార్కెట్లు సహా అనేక అంశాలు ప్రభావం చూపిస్తాయి. గ్లోబల్ గోల్డ్ రేట్లలో హెచ్చుతగ్గులు ఉండేలా చేస్తాయి. ముఖ్యంగా కరోనా వెలుగులోకి వచ్చిన అనంతరం పసిడి, వెండిపై పెట్టుబడి పెట్టడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకనే పసిడి ధరలు రోజురోజుకీ పైపైకి పెరిగాయని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత బంగారం, వెండి ఆల్ టైం హై కి చేరుకున్నాయి. అప్పటినుంచి ధరల్లో స్థిరత్వం ఏర్పడలేదు. ఒకరోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతూ.. అస్థిరంగా కొనసాగుతున్నాయి.  దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈరోజు బంగారం ధరలు క్రింది విధంగా ఉన్నాయి.

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,090గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,090గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,140గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,430గా ఉంది. దేశంలో ప్రధాన నగరమైన చెన్నైలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,320గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,420గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రధాన నగరాల్లో..22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర నిన్న‌ రూ. 44,990లు ఉండగా రూ. 20 క్షీణించి నేడు రూ. 44,970కు దిగొచ్చింది. 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర నిన్న రూ. 49,090లు ఉండగా.. ఇవాళ రూ. 20 మేర తగ్గి 10 గ్రాములు రూ.49,070లుగా కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

వెండి ధ‌ర‌లు
ఓ వైపు బంగారం కొంతమేర దిగి వస్తే.. మరోవైపు వెండి ధర మాత్రం పెరిగింది. దేశీయంగా కేజీ వెండి ధర రూ.300 మేర పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.65,800కు చేరింది. గత రెండు రోజులుగా వెండి ధరల్లో ఎటువంటి పెరుగుదల లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి, నేడు మాత్రం కొంతమేర పెరుగుదల కనిపించింది. అయితే అంతర్జాతీయంగా వెండి ధరలో కొంతమేర తగ్గుదల ఉంది.

click me!