RBI Monetary Policy 2024: వరుసగా 8వ సారి రేపో రేటు కొనసాగింపు, 7.2%కి పెరిగిన FY25 GDP..

By Ashok kumar Sandra  |  First Published Jun 7, 2024, 2:43 PM IST

ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్ పతనం కొనసాగింది. 18109 కోట్ల విదేశీ పెట్టుబడులను స్టాక్ మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నారు.


 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం బుధవారం ప్రారంభమైంది, అయితే వరుసగా ఎనిమిదో సారి రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎంపీసీ సమావేశం కావడం ఇదే తొలిసారి.

విలేకరుల సమావేశంలో ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ జిడిపి (స్థూల దేశీయ వృద్ధి) అంచనాను FY 25కి 7.2 శాతానికి సవరించారు, అయితే అంతకుముందు ఊహించిన 7 శాతం నుండి ఇప్పుడు పెరిగింది.

Latest Videos

undefined

పాలసీ ప్రకటన వెలువడిన వెంటనే సెన్సెక్స్ దాదాపు ఒక శాతం లేదా 700 పాయింట్లకు పైగా పెరిగి 75,814 స్థాయికి చేరుకోవడంతో జిడిపి అంచనాల పెంపును స్టాక్ మార్కెట్ ఉత్సాహపరిచింది.

ఏప్రిల్‌లో సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని  నిర్ణయించింది. శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల MPC 5:1 ఓటింగ్‌లో నిర్ణయాలు తీసుకున్నారు.

RBI రెపో రేటును స్థిరంగా ఉంచడంతో, రెపో రేటుతో అనుసంధానించిన అన్ని  బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్లు పెరగవు, రుణగ్రహీతలకు  ప్రతినెలా ఈఎంఐ (EMIలు) పెరగనందున వారికి ఉపశమనం లభిస్తుంది.

అయితే, ఎక్కువ మంది డిపాజిటర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు పోటీ రేట్లను ఆఫర్ చేయడంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డి) వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు. బ్యాంకుల సొంత రుణాలు, డిపాజిట్ రేట్లను బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నందున, మరిన్ని డిపాజిట్లను ఆకర్షించడానికి FDలపై అధిక వడ్డీ రేట్లను అందించవచ్చు కాబట్టి రేట్లను పర్యవేక్షించడానికి ఇదే బెస్ట్  సమయం.

అలాగే లోక్ సభ ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత స్టాక్ మార్కెట్ పతనం కొనసాగింది. 18109 కోట్ల విదేశీ పెట్టుబడులను స్టాక్ మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నారు. గత ఆరు రోజుల్లో ఈ మొత్తం విత్‌డ్రా చేయబడింది. ఎలెక్షన్స్ ఫలితాల ప్రకటన తర్వాత సెన్సెక్స్ 6 శాతం పడిపోయింది. అయితే ఫలితాలు ప్రకటించిన రోజు జూన్ 4న మాత్రమే 12,436 కోట్లు ఉపసంహరించబడ్డాయి. 

click me!