తాజాగా ఇటలీలో జరిగిన తన కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో నీతా అంబానీ ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వాచ్ మామూలు వాచ్ కాదు, ఎందుకంటే దీని ధర రూ. 3 కోట్లు.
ఇప్పుడు ఎక్కడ చూసినా అంబానీ కుటుంబమే వార్తల్లో నిలుస్తోంది. దీనికి కారణం ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రెండో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ తాజాగా ఇటలీలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో అంబానీ కుటుంబంలోని ప్రతి ఒక్కరు అదిరిపోయే లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా నీతా అంబానీ 60 ఏళ్ల వయసులో కూడా తన స్టైలిష్ లుక్ ద్వారా ఫ్యాషన్ ప్రియుల మససును ఆకట్టుకుంది. ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ చివరి రోజున నీతా అంబానీ ధరించిన వాచ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. జాకబ్ & కో బ్రాండ్ చెందిన ఈ వాచ్ ధర అక్షరాల రూ. 3 కోట్లు. ఈ ఖరీదైన వాచ్‌లో 18 క్యారెట్ రోజ్ గోల్డ్ కేస్ ఉంది. దీనిలో రెయిన్‌బో సఫైర్ తో బెజెల్ అండ్ ఇన్నర్ రింగ్ సెట్ ఉంది.
ఈ ఈవెంట్ కోసం నీతా అంబానీ పింక్ ఫ్లవర్స్ ఉన్న వైట్ మ్యాక్సీ డ్రెస్ ధరించింది. ఈ డ్రెస్ ను ఆస్కార్ డి లా రెంటా డిజైన్ చేశారు. ఈ డ్రెస్ ధర అడిగితే ఒక్క క్షణం కూడా ఆశ్చర్యపోక తప్పదు. ఎందుకంటే ఈ డ్రెస్ ధర రూ.6,02,819. అయితే, నీతా అంబానీ ధరించిన వాచ్‌తో పోలిస్తే ఈ డ్రెస్ అంతేమి ఎక్కువ కాదు. అయితే వాచ్ విలువ రూ.3 కోట్లు ఎందుకో తెలుసా..
నీతా అంబానీ ఖరీదైన డ్రెస్‌తో పాటు సాధారణ మేకప్ లుక్‌లో ఈ వాచ్‌తో కనిపించింది. ఆమె హెయిర్ స్టయిల్ తన డ్రెస్ కు సరిపోయేలా స్టైల్ చేసింది.
ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ వాటర్ నీతా అంబానీ తాగుతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ ఫోటో కూడా చక్కర్లు కొట్టింది. అయితే అది మార్ఫింగ్ చేసిన ఫోటో అని తెలిపారు. నీతా అంబానీ తాగే నీళ్లను 'ఆక్వా డి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఏ మోడిగ్లియాని' అంటారు. కస్టమర్ కోరుకున్న డిజైన్‌లో ప్రముఖ డిజైనర్ ఫెర్నాండో అల్టామిరానో రూపొందించిన బాటిల్‌లో ఈ నీటిని అందిస్తారు. ఈ సీసా 24 క్యారెట్ల బంగారు కవర్‌తో ఉంది. ఇది ఫ్రాన్స్ అండ్ ఫిజీ నుండి వచ్చిన సహజ నీటి అలాగే ఐస్‌లాండ్ నుండి హిమనదీయ నీటి మిశ్రమం. ఈ ఒక్కో బాటిల్ ధర రూ.49 లక్షలు.
నీతా అంబానీ దగ్గర ఖరీదైన టీ సెట్ కూడా ఉంది. ఇందులో రోజూ ఆమె టీ తాగుతుంటారు. దీనిని జపాన్ చెందిన కంపెనీ తయారు చేసింది, దీని ధర సుమారు రూ. 1.5 కోట్లు!
నీతా అంబానీ వేసుకునే డ్రెస్సులు, వాడే మెటీరియల్స్ చాలా ఖరీదైనవి. నీతా అంబానీ ఖరీదైన వస్తువులను ఉపయోగించడం ఇష్టపడుతుంది. అందువల్ల ఆమె ఉపయోగించే ప్రతిది ప్రత్యేకమైనది ఇంకా ఖరీదైనది. అలాగే, ఆమె ఉపయోగించే ఖరీదైన వస్తువులు తరచుగా ముఖ్యాంశాలుగా ఉంటాయి.