
Multibagger Penny stock: COVID 19 మహమ్మారి కారణంగా స్టాక్ మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ 2020-21లో భారతీయ మార్కెట్ ఇన్వెస్టర్లకు మాత్రం మంచి రాబడిని అందించాయి. ముఖ్యంగా మల్టీబ్యాగర్లు ఇన్వెస్టర్లకు కొంగుబంగారంగా మారాయి. మల్టీ బ్యాగర్ల కోసం సెకండరీ మార్కెట్‌లో ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడం కూడా మార్కెట్‌కు భారీగా దోహదపడింది. 2020-21లో పెద్ద సంఖ్యలో మల్టీబ్యాగర్ స్టాక్‌లు కనిపించాయి, వాటిలో చాలా వరకూ పెన్నీ స్టాక్‌లు కూడా ఉన్నాయి.
నిజానికి పెన్నీ స్టాక్స్ అంటే చాలామంది నిపుణులు అంత ఆసక్తి చూపరు. ఎందుకంటే ఫండమెంట్స్ పరంగా చూస్తే మార్కెట్ క్యాప్ వెయిటేజీతో ప్రధాన ఇండెక్స్ లోని సూచీలనే ఎక్కువగా నిపుణులు సిఫారసు చేస్తుంటారు. ఎందుకంటే ఆయా కంపెనీల కార్పోరేట్ గవర్నెన్స్ పటిష్టంగా ఉంటుందని భావిస్తారు. కానీ కొన్ని పెన్నీ స్టాక్స్ సైతం చక్కటి ఫండమెంటల్స్ తో మార్కెట్లో మల్టీ బ్యాగర్లుగా నిలుస్తుంటాయి.
అలాంటి స్టాక్స్ లో ఒకటి.. సింధు ట్రేడ్ లింక్స్ (Sindhu Trade Links). ఈ BSEలో లిస్ట్ అయి ఉండగా, గత 1 సంవత్సరంలో 1750 శాతం కంటే ఎక్కువ ర్యాలీని సాధించింది. అయితే ఈ స్టాక్ ఇంత అద్భుతమైన రాబడిని కేవలం ఈ సంవత్సరం మాత్రమే కాదు. ఈ స్టాక్ గత 5 ఏళ్లలో రూ.1.69 నుంచి రూ.132.10కి పెరిగింది. అంటే గడిచిన 5 సంవత్సరాలలో, ఇది 7700 శాతం రాబడిని అందించింది.
ఇక గడిచిన ఒక నెలలో, ఈ స్టాక్ రూ.121.50 నుండి రూ.132.10కి పెరిగింది. ఒక నెలలో, ఈ స్టాక్ దాదాపు 10 శాతం ర్యాలీ చేసింది. అదేవిధంగా గత 6 నెలల్లో ఈ స్టాక్ రూ.14.87 నుంచి రూ.132.10కి పెరిగింది. ఈ స్టాక్ 6 నెలల్లో 800% రాబడిని ఇచ్చింది. గత 1 సంవత్సరంలో, ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ రూ.7.11 నుండి రూ.132.10కి పెరిగింది. ఇది 1 సంవత్సరంలో 1750 శాతం పెరుగుదలను సాధించింది.
ఈ స్టాక్ ప్రయాణాన్ని పరిశీలిస్తే, ఒక ఇన్వెస్టర్ 1 నెల క్రితం ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే, ఈ రోజు అతనికి రూ. 1.10 లక్షలు వచ్చేవి. మరోవైపు, 6 నెలల క్రితం ఎవరైనా ఇందులో రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే, అతనికి రూ. 9 లక్షలు వచ్చేవి, అయితే 1 సంవత్సరం క్రితం ఎవరైనా ఈ స్టాక్‌లో రూ. లక్ష పెట్టుబడి పెడితే, అతనికి రూ. 18.50 లక్షలు వచ్చేవి. అదే విధంగా ఐదేళ్ల క్రితం ఎవరైనా ఈ స్టాక్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఈరోజు రూ.78 లక్షలు పొంది ఉండేవారు.
సింధు ట్రేడ్ లింక్స్ లిమిటెడ్ యొక్క ప్రస్తుత మార్కెట్ క్యాప్ ₹ 6,790 కోట్లు. ఈ షేరు 52 వారాల కనిష్టం రూ. 5.32 వద్ద ఉండగా, 52 వారాల గరిష్టం రూ. 166.20 వద్ద ఉంది.