
ప్రస్తుతం ఉద్యోగాలు చాలా ఒత్తిడితో కూడుకున్నవి. పని ఒత్తిడి కారణంగా నిద్రలేమి కూడా ఉంటుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు మానసిక ఒత్తిడిని తగ్గించే వివిధ మార్గాలు అన్వేషిస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ ఉద్యోగుల కోసం అదిరిపోయే నిర్ణయాన్ని తీసుకుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు పని.. పని అంటూ తీవ్ర ఒత్తిడి ఉంటుంది. దీంతో ఉద్యోగులు కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు. కొంతమంది కాస్త విరామం దొరికితే కునుకు తీసి, రీఫ్రెష్ అవుదామని భావిస్తారు.
అలాంటి వారి కోసం బెంగళూరులోని స్టార్టప్ ఊరటను కల్పించింది. వేక్ ఫిట్ సొల్యూషన్స్ అనే స్టార్టప్ మధ్యాహ్నం 30 నిమిషాలు కునుకు తీయడానికి ఉద్యోగులకు అవకాశమించ్చింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. ఉద్యోగులు మధ్యాహ్నం గం.2 నుండి గం.2.30 వరకు కునుకు తీసే వెసులుబాటు కల్పించింది. నాసా అధ్యయనం ప్రకారం మధ్యాహ్నం 26 నిమిషాలు కునుకు తీస్తే ఆ ఉద్యోగి సామర్థ్యం 33 శాతం పెరుగుతుందని వెల్లడైంది. గత ఆరేళ్లుగా వేక్ ఫిట్ పరుపులు, తలగడలు తయారు చేసే వ్యాపారంలో ఉంది. వేక్ ఫిట్ కో-ఫౌండర్ రామలింగగౌడ మాట్లాడుతూ తాము గత ఆరేళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నామని, ఉద్యోగులకు విశ్రాంతి కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని, మేం ఎల్లప్పుడు నిద్రను సీరియస్‌గా తీసుకుంటామని చెప్పారు.
వేక్‌ఫిట్ సొల్యూషన్స్ అనే స్టార్టప్ మధ్యాహ్నం 30 నిమిషాలు కునుకు తీయొచ్చునని అధికారికంగా ప్రకటించింది. ఆ కంపెనీ ఉద్యోగులు మధ్యాహ్నం 2 నుంచి 2.30 వరకు కునుకు తీసే వెసులుబాటు కల్పించింది. నాసా అధ్యయనం ప్రకారం మధ్యాహ్నం పూట 26 నిముషాలు నిద్రపోతే ఆ ఉద్యోగి పని చేసే సామర్థ్యం 33% పెరుగుతుందని తేల్చింది. గత ఆరేళ్లుగా వేక్‌ఫిట్ పరుపులు, తలగడలు తయారు చేసే వ్యాపారంలో ఉంది.