ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం ఇదే... ఫుల్ బాటిల్ ధర రూ. 30 కోట్లు..ఒక పెగ్గు ధర ఎంతో ఊహించుకోండి..?

By Krishna Adithya  |  First Published Jun 29, 2023, 8:23 PM IST

బిలియనీర్ వోడ్కా, లియోన్ వెర్రెస్ మాస్టర్ పీస్, ప్రపంచంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన మద్యం ఇదే. దీని ధర 3.7 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 30 కోట్లు. ప్రత్యేకంగా అలంకరించిన ఈ వోడ్కా బాటిల్  ను 3000 వజ్రాలతో అలంకరించారు. 


 సాధారణంగా మనకు తెలిసిన మద్యం బ్రాండ్లలో అత్యంత ఖరీదైనది అంటే సుమారు పాతికవేల నుంచి పదివేల వరకు ఉంటుంది.  సాధారణంగా విదేశాల నుంచి వచ్చేవారు ఇలాంటి  ఖరీదైన మద్యం సీసాలను తీసుకొని వస్తుంటారు.  ఇక ఖరీదైన మద్యం విషయానికి వస్తే చాలా మంచి స్కాచ్ గురించి చెబుతూ ఉంటారు కొన్ని రకాల స్కాచ్ బాటిల్స్ లక్షల్లో విలువ చేస్తూ ఉంటాయి.  ఇవి వందేళ్లు ఆపై సంవత్సరాలు పులియబెట్టిన స్కాచ్ విస్కీ అవ్వడం వల్ల ఇంత ఖరీదు అవుతుంది.  కానీ  బిలియనీర్ బ్రాండ్ కు చెందిన బాటిల్ మాత్రం భూమి మీద ఉన్న అత్యంత ఖరీదైన మద్యం గా చెబుతున్నారు.  మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.  

చాలా మంది ఆల్కహాల్ ప్రేమికులు వోడ్కా గురించి తెలిసే ఉంటుంది. ఇది కొందరికి ఇష్టమైన మద్యం . ఒకే బ్రాండ్‌లో అనేక రకాలు ఉంటాయి. ఒక్కోదానికి ఒక్కో ధర ఉంటుంది. అదేవిధంగా బిలియనీర్ వోడ్కా అనే బ్రాండ్ ధర ఎంతో తెలిస్తే కళ్లు తిరగడం ఖాయం. ఈ వోడ్కా బాటిల్ ధర ఎంతో తెలిస్తే షాక్ తినడం ఖాయం. ఈ మద్యం బాటిల్ కొనే డబ్బుతో మీకు లైఫ్ టైం సెటిల్ మెంట్ అవడం ఖాయం. బిలియనీర్ బ్రాండ్ నేమ్ పేరిట చలామణి అయ్యే ఈ మద్యం సీసా  ధర 30 కోట్లు అంటే ఆశ్చర్య పోవడం ఖాయం. 

Latest Videos

బిలియనీర్ వోడ్కా, లియోన్ వెర్రెస్ మాస్టర్ పీస్, ప్రపంచంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన మద్యం ఇదే. దీని ధర 3.7 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 30 కోట్లు. ప్రత్యేకంగా అలంకరించబడిన ఈ వోడ్కా బాటిల్ 3000 వజ్రాలతో అలంకరించబడింది. ఈ మద్యం బాటిల్ చుట్టూ ప్రత్యేక పూతతో ఆకర్షణీయమైన వైలెట్-హ్యూడ్ హెవీ గ్లాస్‌తో తయారు చేయబడింది. 

ఇది కాకుండా, దీనికి ప్రత్యేకమైన కళా శైలి కూడా ఉంది. లోపల మద్యం కంటే ఖరీదైనది దాని సీసా, ఇది ప్లాటినం, రోడియం వంటి  విలువైన లోహాల కలయికతో తయారు చేశారు. దీని ఉపరితలంపై వజ్రాలతో అలంకరించబడింది. దీనికి గోల్డ్ లేబుల్ కూడా ఉంది. అత్యంత ఖరీదైన వజ్రాలతో అలంకరించబడిన ఈ వోడ్కా బాటిల్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మద్యం ఉంది.

click me!