పాలు, పిడకలు అమ్మి కోటీశ్వరుడు అయిన మహారాష్ట్ర రైతు..షాక్ లో గ్రామ ప్రజలు.. రోజుకు ఎంత సంపాదిస్తాడంటే..?

By Krishna Adithya  |  First Published Jun 29, 2023, 7:41 PM IST

మన దేశంలో పాడి పంటలకు కొదవలేదు.  పాడి పశువులను నమ్ముకుని మన దేశంలో కోట్లాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.  తాజాగా మహారాష్ట్రలోని సోలాపూర్ లో ఓ రైతు ఆవులను పెద్ద ఎత్తున పెంచి వాటి పాలను విక్రయించడం ద్వారా కోటీశ్వరుడు గా మారిన ఘటన సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.


మహారాష్ట్రకు చెందిన ఓ రైతు ఆవు పాలు అమ్మి పెద్ద బంగ్లా కట్టి దానికి గోధన్ నివాస్ అని పేరు పెట్టాడు. అంతేకాదు అతను ఆవును దేవతగా ఆరాధిస్తూ, తన ఇంటిలోని పూజ గదిలో ఒక ఆవు ఫోటోను ఉంచాడు ఆవులకు కృతజ్ఞతలు తెలుపుతూ బంగ్లా పైభాగంలో ఆవు విగ్రహాన్ని ఉంచాడు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా స్థానికులకు బాబుగా సుపరిచితుడైన ఈ రైతు పేరు ప్రకాష్ ఆమ్డే. ఆయన కథ ఇప్పుడు పాడిపరిశ్రమపై ఆసక్తి ఉన్న ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. కేవలం ఒక ఆవుతో ఈ వ్యాపారం ప్రారంభించిన ప్రకాష్ ఆమ్డే 150 ఆవులను కలిగి ఉన్నాడు. పాలు, ఆవు పేడను అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు. ప్రస్తుతం ఆయన కోటి రూపాయలతో నిర్మించిన బంగ్లా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

తన ఇంటిలో మొదటి ఆవు అయిన లక్ష్మికి నమస్కరిస్తూ తన రోజువారీ కార్యకలాపాలను ప్రారంభించే ప్రకాష్ ఆమ్డే, జీవితంలో అసాధ్యమైన వాటిని సాధించడానికి సహాయం చేసిన గోవుల గౌరవార్థం తన నివాసానికి గోధాన్ అని పేరు పెట్టారు. ప్రకాష్ ఆమ్డే  తనకు వారసత్వంగా వచ్చిన నాలుగు ఎకరాల భూమిని సాగు చేయడం అసాధ్యం అని భావించినప్పుడు 1998లో ఆవు పాలు, ఆవు పేడ విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఒక ఆవుతో ప్రారంభమైన ఈ డెయిరీ ఫామ్‌లో ప్రస్తుతం 150 ఆవులు ఉండగా, రోజుకు 1,000 లీటర్ల పాలను విక్రయిస్తున్నారు. లీటరు పాలు రూ. 80 చొప్పున రోజుకు రూ. 80,000 సంపాదిస్తున్నాడు. 

Latest Videos

ఇమ్డే కుటుంబం మొత్తం ఈ పాల వ్యాపారంలో పాలుపంచుకుంటుంది, ఆవులకు మేత తీసుకురావడం నుండి పాలు పితకడం, పాలు అమ్మడం వరకు అతని కుటుంబం అంతా చూసుకుంటుంది. ఇప్పటి వరకు తన ఇంట్లో పుట్టిన ఒక్క ఆవు కూడా  వట్టిపోయిన తర్వాత అమ్ముకోలేదని  ఆయన గర్వంగా చెబుతున్నారు. 

ఈ ఆవులకు రోజుకు నాలుగు నుంచి ఐదు టన్నుల పచ్చి మేత అవసరం. వీలైనంత పశుగ్రాసాన్ని సొంత పొలాల్లో పెంచుకుని మిగితా వాటిని బయటి నుంచి కొంటారు. ఆవుల పెంపకం అతన్ని పారిశ్రామికవేత్తగా మార్చింది. ఈ రైతు గ్రామంలోని ప్రజలకు పుష్కలంగా ఉపాధి అవకాశాలు కల్పించాడు. ఇది కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడకు వచ్చి తమ పరిశ్రమ గురించి తెలుసుకుంటున్నారని ఆయన తెలిపారు. 

 అంతేకాదు ఆయన తన డైరీ ఫార్మ్ ద్వారా గ్రామంలో చాలా మంది యువకులకు ఉపాధి కల్పిస్తున్నారు.  దీంతోపాటు ఆవు పిడకలను వంటచిరపుగా వాడటం ద్వారా గ్యాస్ ఖర్చు ఉండదని అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని ఆయన చెబుతున్నారు.  దీంతోపాటు ఆవు పేడ ద్వారా ఉత్పత్తి చేసే ఆర్గానిక్ ఎరువులను సైతం చుట్టుపక్కల రైతులు  పెద్ద ఎత్తున కొని తీసుకెళ్తున్నారని,  ఆయన పేర్కొన్నారు.  
 

click me!