ఆస్ట్రేలియాపై ఇండియా టీం చారిత్రాత్మక విజయం.. ప్రశంసలు కురిపించిన నీతా అంబానీ..

By S Ashok KumarFirst Published Jan 20, 2021, 12:06 PM IST
Highlights

 బార్డర్ -గవాస్కర్ ట్రోఫీని గెలుచుకున్న భారత క్రికెట్ జట్టును రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్, ఐపిఎల్ ఫ్రాంచైజ్ ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ అభినందించారు.

ముంబై: ఆస్ట్రేలియాను ఓడించి బార్డర్ -గవాస్కర్ ట్రోఫీని గెలుచుకున్న భారత క్రికెట్ జట్టును రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్, ఐపిఎల్ ఫ్రాంచైజ్ ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ అభినందించారు.

 32 సంవత్సరాల రెండు నెలలు తరువాత ఆస్ట్రేలియా గడ్డపై  యువ భారత జట్టు ఆస్ట్రేలియాను మూడు వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

also read 

"ఇంత చారిత్రాత్మక విజయం సాధించినందుకు భారత జట్టుకు నా అభినందనలు. ఈ అద్భుతమైన సిరీస్ విజయంలో మీలో ప్రతి ఒక్కరూ ఆత్మ విశ్వాసం, ధైర్యం, సంకల్పం, నిర్భయత చూపించారు. ఇది మన యంగ్ ఇండియా - న్యూ ఇండియా. దేశం మొత్తాన్ని ఉత్తేజితం చేసిన మీ విజయానికి ఒక భారతీయురాలిగా గర్వపడుతున్నాను, అభినందిస్తున్నాను "అని నీతా అంబానీ అధికారిక ప్రకటనలో తెలిపారు.

ఈ అద్భుత విజయంపై అటు క్రికెట్‌ లెజెండ్స్‌,  ఇతర క్రీడాభిమానులతోపాటు దేశవ్యాప్తంగా పలువురు  ప్రముఖులు హర్షం వక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 36 పరుగులకు బండిల్ అయ్యింది, అజింక్య రహానే నేతృత్వంలోని జట్టు మెల్బోర్న్ మరియు బ్రిస్బేన్లలో గొప్ప విజయాలు నమోదు చేసింది.
 

click me!