వాహనదారులపై ఇంధన పిడుగు.. నేడు మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

Ashok Kumar   | Asianet News
Published : Jan 19, 2021, 11:00 AM ISTUpdated : Jan 20, 2021, 12:04 AM IST
వాహనదారులపై ఇంధన పిడుగు.. నేడు మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

సారాంశం

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ సమాచారం ప్రకారం పెట్రోల్ ధర లీటరుకు రూ.84.95 నుంచి రూ .85.20కు పెంచారు. డీజిల్ ధరలు కూడా 25 పైసలు పెరిగి 75.38 రూపాయలకు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు 91.80 రూపాయలకు చేరగా, డీజిల్‌ ధర రూ.81.87గా ఉన్నది.

న్యూ ఢీల్లీ: ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు నేడు మరోసారి ఇంధన ధరలను పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ పై లీటరుకు 25 పైసలు పెంచడంతో పెట్రోల్ ధర మంగళవారం మరోసారి ఆల్ టైం గరిష్టా స్థాయికి చేరింది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ సమాచారం ప్రకారం పెట్రోల్ ధర లీటరుకు రూ.84.95 నుంచి రూ .85.20కు పెంచారు. డీజిల్ ధరలు కూడా 25 పైసలు పెరిగి 75.38 రూపాయలకు చేరింది.

ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు 91.80 రూపాయలకు చేరగా, డీజిల్‌ ధర రూ.81.87గా ఉన్నది. దీంతో పెట్రోల్ ధర ముంబైలో కొత్త రికార్డు స్థాయికి చేరుకుంది.

2021 జనవరి 19న నాలుగు మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

also read బడ్జెట్ 2021-22: రాష్ట్రాలు, కేంద్రపాలిత మంత్రులతో సమావేశమైన నిర్మల సీతారామన్.. ...

నగరం            పెట్రోల్     డీజిల్ 
ఢిల్లీ               85.20    75.38
ముంబై           91.80    82.13
చెన్నై             87.85    80.67
కోల్ కత్తా          86.63    78.97
హైదరాబాద్     88.37     81.99

వారం వ్యవధిలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలో రూపాయికిపైగా పెరుగుదల నమోదుకావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. 

4 అక్టోబర్ 2018న ఢీల్లీలో పెట్రోల్‌ ధర అత్యధికంగా లీటరుకు రూ.84  చేరింది. డీజిల్ కూడా లీటరుకు గరిష్ట స్థాయి రూ.75.45 చేరుకుంది. ఆ సమయంలో ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించడానికి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 1.50 రూపాయలు తగ్గించింది. దానితో పాటు, ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు లీటరుకు మరో రూ.1 ధరలను తగ్గించారు.

మే 2020 నుండి పెట్రోల్ ధర లీటరుకు రూ.14.28, డీజిల్ రూ.11.83 పెరిగిందని చమురు కంపెనీల ధర నోటిఫికేషన్లు తెలిపాయి. యు.ఎస్. ముడి 0.1% పడిపోయి 52.29 డాలర్లకు చేరుకోగా, బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.48 శాతం పెరిగి 55.02 డాలర్లకు చేరుకున్నాయని ఒక నివేదిక తెలిపింది.
 

PREV
click me!

Recommended Stories

Recharge Price Hike : న్యూఇయర్ లో మీ ఫోన్ మెయింటెనెన్స్ మరింత కాస్ట్లీ.. మొబైల్ రీచార్జ్ ధరలు పెంపు..?
Youtube Income: యూట్యూబ్‌లో గోల్డెన్ బటన్ వస్తే నెలకు ఎన్ని డబ్బులు వస్తాయి?