
ఫిక్స్‌డ్ డిపాజిట్లు (Fixed Deposits) నష్టభయం లేని, వడ్డీ హామీతో కూడిన సురక్షితమైన పెట్టుబడి పథకాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా ఇవి నిలుస్తున్నాయి. సాధారణంగా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ రేటును అందిస్తాయి. సాధారణ రేట్ల కంటే 50bps లేదా 0.5 శాతం అదనపు వడ్డీని అందిస్తాయి. కొన్ని బ్యాంకులు(Banks) వీరికి ఇంతకంటే పెద్ద మొత్తంలో వడ్డీ ఆఫర్ (Interest Offer) చేస్తాయి.
ఇండస్‌ఇండ్ బ్యాంక్ (Indus Bank) సీనియర్ సిటిజన్‌ల కోసం FDలపై 7 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇండస్ ఇండ్ బ్యాంక్‌లో 2 నుంచి 5 సంవత్సరాల కాల వ్యవధితో చేసే FDలపై సాధారణ డిపాజిటర్లు 6.50 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు 7 శాతం వడ్డీని పొందవచ్చు. ఇది ఇతర బ్యాంకులు అందిస్తున్న వడ్డీ కంటే చాలా ఎక్కువ. వివిధ కాల వ్యవధిలో రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే FDలపై ఇండస్‌ఇండ్ బ్యాంక్ అందించే వడ్డీ రేట్లు చూద్దాం.
- 7 - 14 రోజులు: సాధారణ డిపాజిటర్లకు 2.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం
- 15 - 30 రోజులు: సాధారణ డిపాజిటర్లకు 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం
- 31 - 45 రోజులు: సాధారణ డిపాజిటర్లకు 3.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.75 శాతం
- 46 - 60 రోజులు: సాధారణ డిపాజిటర్లకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.00 శాతం
- 61 - 90 రోజులు: సాధారణ డిపాజిటర్లకు 3.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.25 శాతం
- 91 - 120 రోజులు: సాధారణ డిపాజిటర్లకు 4.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.50 శాతం
- 121 - 180 రోజులు: సాధారణ డిపాజిటర్లకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.00 శాతం
- 181 - 210 రోజులు: సాధారణ డిపాజిటర్లకు 4.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.10 శాతం
- 211 రోజులు: సాధారణ డిపాజిటర్లకు 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.25 శాతం
- 270 రోజులు: సాధారణ డిపాజిటర్లకు 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.00 శాతం
- 355 - 364 రోజులు: సాధారణ డిపాజిటర్లకు 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.00 శాతం
- 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 6 నెలల కంటే తక్కువ: సాధారణ డిపాజిటర్లకు 6.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం
- 1 సంవత్సరం 6 నెలల నుంచి 1 సంవత్సరం 7 నెలల కంటే తక్కువ: సాధారణ డిపాజిటర్లకు 6.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం
- 1 సంవత్సరం 7 నెలల నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ డిపాజిటర్లకు 6.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం
- 2 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల 6 నెలల కంటే తక్కువ: సాధారణ డిపాజిటర్లకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.00 శాతం
- 2 సంవత్సరాల 6 నెలల నుంచి 2 సంవత్సరాల 9 నెలల కంటే తక్కువ: సాధారణ డిపాజిటర్లకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.00 శాతం
- 2 సంవత్సరాల 9 నెలల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ డిపాజిటర్లకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.00 శాతం
- 3 సంవత్సరాల నుంచి 61 నెలల కంటే తక్కువ: సాధారణ డిపాజిటర్లకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.00 శాతం
- 61 నెలలు, అంతకంటే ఎక్కువ వ్యవధికి: సాధారణ డిపాజిటర్లకు 6.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం
- ఇండస్ ట్యాక్స్ సేవర్ స్కీమ్ (5 సంవత్సరాలు): సాధారణ డిపాజిటర్లకు 6.50 శాతం, 7.00 శాతం