1 july 2022:ఈ రోజు నుండి మారనున్న రూల్స్ ఇవే.. మీ పై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే..?

By asianet news teluguFirst Published Jul 1, 2022, 12:57 PM IST
Highlights

మీరు జూన్ 30 వరకు డీమ్యాట్ అక్కౌంట్ KYC చేయకుంటే  ఐన్ ఆక్టివ్ గా మారుతుంది . అంటే మీరు స్టాక్ మార్కెట్‌లో షేర్లు కొనడం లేదా అమ్మడం చేయలేరు. మీరు షేర్ కొనుగోలు చేసినా అది మీ అక్కౌంట్ కి బదిలీ చేయబడదు. KYC పూర్తయిన తర్వాత మాత్రమే బదిలీ జరుగుతుంది.

ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఏడు నియమాలు జూలై 1 నుండి అంటే శుక్రవారం నుంచి మారబోతున్నాయి. వీటిలో క్రిప్టోకరెన్సీల లావాదేవీలపై TDS, ఆధార్-పాన్ కార్డ్ లింకేజ్, డీమ్యాట్ KYC మొదలైనవి ఉన్నాయి. ఇవి కాకుండా గ్యాస్ ధరలలో సవరణ సహ  ఇతర మార్పులు కూడా ఉండవచ్చు. ఈ మార్పులు మీ ఆదాయంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపవచ్చు.

ఆధార్ కార్డ్‌పై రూ.1,000 చార్జ్
ఇప్పుడు ఆధార్, పాన్ కార్డ్‌ని లింక్ చేయడానికి రూ.1,000 చార్జ్ చెల్లించాలి. ఇప్పటి వరకు రూ.500 ఉండేది. అయితే మార్చి వరకు ఉచితంగా ఉండేది. ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు ఆధార్, పాన్ లింక్ చేయవచ్చు.

మీరు జూన్ 30 వరకు డీమ్యాట్ అక్కౌంట్ KYC చేయకుంటే  ఐన్ ఆక్టివ్ గా మారుతుంది . అంటే మీరు స్టాక్ మార్కెట్‌లో షేర్లు కొనడం లేదా అమ్మడం చేయలేరు. మీరు షేర్ కొనుగోలు చేసినా అది మీ అక్కౌంట్ కి బదిలీ చేయబడదు. KYC పూర్తయిన తర్వాత మాత్రమే బదిలీ జరుగుతుంది.

ఇప్పుడు జూలై 1 నుంచి క్రిప్టోకరెన్సీల లావాదేవీలపై 1 శాతం టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం, ఇందులో అన్ని రకాల NFTలు, డిజిటల్ కరెన్సీలు ఉంటాయి.  

ద్విచక్ర వాహనాలు, ఏసీలు
జూలై 1 నుంచి ఖరీదైన ద్విచక్ర వాహనాల ధరలు పెరగనున్నాయి. హీరో మోటో కార్ప్ ధరలను రూ.3,000 వరకు పెంచబోతోంది. మరోవైపు  ఇతర కంపెనీలు కూడా ధరలను పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయి. 5 స్టార్ ఏసీని కొనుగోలు చేయడం వల్ల 10 శాతం ఖర్చు పెరుగుతుంది.

క్రెడిట్ కార్డు ఇవ్వకపోవడానికి గల కారణాలను తెలియజేయాల్సి ఉంటుంది. దీనితో పాటు, బీమా కవర్ కూడా ఆప్షనల్ గా ఇవ్వాలి. కస్టమర్ ఆమోదం లేకుండా కార్డ్ అప్‌గ్రేడ్ చేయబడదు. పొరపాటున జరిగితే, కార్డు జారీచేసే వారు ఛార్జీలు తిరిగి చెల్లించవలసి ఉంటుంది, కానీ జరిమానా కూడా చెల్లించవలసి ఉంటుంది.

  ఇప్పుడు బ్యాంకులు  బోర్డు ఆమోదంతో మాత్రమే ఏ కస్టమర్‌కైనా డెబిట్ కార్డ్‌లను జారీ చేయగలవు. దీనికి ఆర్‌బీఐ అనుమతి అవసరం లేదు. సేవింగ్స్ అండ్ కరెంట్ అకౌంట్ ఉన్న కస్టమర్లకు మాత్రమే డెబిట్ కార్డ్ ఇవ్వబడుతుంది. బ్యాంకు ఎవరికీ బలవంతంగా డెబిట్ కార్డు జారీ చేయదు.

click me!