ఎల్‌పి‌జి గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు.. నేటి నుండే అమల్లోకి.. ఎంత తగ్గిందటే..?

By asianet news teluguFirst Published Jul 1, 2022, 10:46 AM IST
Highlights

దేశంలోని ప్రముఖ  మెట్రో నగరాల్లో కోల్‌కతాలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.182, ముంబైలో రూ.190.50, చెన్నైలో రూ.187 తగ్గింది. పెట్రోలియం కంపెనీ ఇండియన్ ఆయిల్ కూడా వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గించింది. మరోవైపు 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ల వినియోగదారులకు ఎలాంటి ఉపశమనం లభించలేదు.  అయితే మే 19న ఉన్న రేటుకే అందుబాటులో ఉంది.
 

ఎల్‌పి‌జి గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇప్పుడు 19 కిలోల  వాణిజ్య సిలిండర్ ధరలు దిగోచ్చాయి.  నేడు శుక్రవారం అంటే జూలై 1 నుండి ఢిల్లీలో  19 కిలోల  ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.198 తగ్గించినట్లు ప్రభుత్వ యాజమాన్యంలోని రిటైలర్లు నోటిఫికేషన్‌లో తెలిపారు.

దేశంలోని ప్రముఖ  మెట్రో నగరాల్లో కోల్‌కతాలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.182, ముంబైలో రూ.190.50, చెన్నైలో రూ.187 తగ్గింది. పెట్రోలియం కంపెనీ ఇండియన్ ఆయిల్ కూడా వాణిజ్య సిలిండర్ల ధరను తగ్గించింది. మరోవైపు 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ల వినియోగదారులకు ఎలాంటి ఉపశమనం లభించలేదు.  అయితే మే 19న ఉన్న రేటుకే అందుబాటులో ఉంది.

గత నెలలో వాణిజ్య సిలిండర్ ధరల తగ్గింపు తర్వాత ఈ చర్య జరిగింది. అంతకుముందు జూన్ 1న రూ.135 తగ్గించారు.  మరోవైపు డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల వినియోగదారులకు మే నెలలో కూడా రెండు సార్లు నిరాశే ఎదురైంది. డొమెస్టిక్ సిలిండర్ల ధరను తొలిసారిగా మే 7న రూ.50 పెంచగా.. మే 19న డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు మరింత పెరిగాయి.

డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్ ధర గత నెలలో ఢిల్లీలో రూ. 1,003కి పెరిగింది - అంటే ఒక నెలలో వరుసగా రెండవ పెరుగుదల. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు LPG ధరలను పెంచడానికి ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లను ప్రేరేపించాయి. గత నెలలో, వంట గ్యాస్ ధరలు సిలిండర్‌కు రూ. 53.50 వరకు పెరిగాయి, దీంతో దేశంలోని చాలా నగరాల్లో గ్యాస్ ధర రూ. 1,000 కంటే పైకి పెరిగింది.

ఉజ్వల పథకం కింద ఉచిత కనెక్షన్లు పొందిన 9 కోట్ల మంది పేద మహిళలు, ఇతర లబ్ధిదారులకు మాత్రమే వంట గ్యాస్ ఎల్‌పిజిపై పరిమిత సబ్సిడీ ఉందని, గృహాలతో సహా మిగిలిన వినియోగదారులు మార్కెట్ ధరను చెల్లిస్తారని గత నెలలో ప్రభుత్వం తెలిపింది. చమురు సెక్రటరీ పంకజ్ జైన్ ఒక సమావేశంలో మాట్లాడుతూ జూన్ 2020 నుండి వంట గ్యాస్‌పై ఎటువంటి సబ్సిడీ లేదని అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్చి 21 న ప్రకటించిన సబ్సిడీ మాత్రమే అందించబడింది అని అన్నారు.

click me!