డిసెంబర్ 1 నుండి కొత్త రూల్స్: గుర్తుంచుకోవాల్సీన ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసా..?

By asianet news teluguFirst Published Nov 28, 2022, 12:22 PM IST
Highlights

ఈసారి డిసెంబర్ 1 నుండి వంటింటి ఎల్‌పిజి సిలిండర్ల ధర తగ్గవచ్చని భావిస్తున్నారు. అక్టోబర్ నెల గణాంకాలు రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే సంకేతాలను చూపిస్తున్నాయి. 

డిసెంబర్ నెలకు ఇంకా కొద్ది రోజులే ఉంది. ప్రతి నెల 1వ తేదీన కొన్ని కొత్త రూల్స్ మార్పులు జరుతుంటాయి. అలాగే డిసెంబరు నెల ప్రారంభంతో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ మార్పులు మన  ఆదాయం ఇంకా పాకెట్ మని పై ప్రభావం చూపవచ్చు, కాబట్టి వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం...

డిసెంబరు 1 నుండి ఎలాంటి  మార్పులు జరగబోతున్నాయో, వాటి వల్ల మన ఖర్చులు, ఆదాయం ఎంత ప్రభావితం అవుతాయో తెలుసుకుందాం..?

ఎల్‌పి‌జి-సి‌ఎన్‌జి అండ్ పి‌ఎన్‌జి ధరలు

గత నెల ప్రారంభంలో వాణిజ్య సిలిండర్ల ధరలను తగ్గించారు, అయితే వంటింటి ఎల్‌పి‌జి సిలిండర్ల ధరలలో ఎటువంటి మార్పు లేదు.  ఈసారి డిసెంబర్ 1 నుండి వంటింటి ఎల్‌పిజి సిలిండర్ల ధర తగ్గవచ్చని భావిస్తున్నారు. అక్టోబర్ నెల గణాంకాలు రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే సంకేతాలను చూపిస్తున్నాయి. దీంతో ఈ నెలాఖరులో పెట్రోలియం కంపెనీలు కూడా వంట గ్యాస్ ధరలలో మార్పును ప్రకటించవచ్చని భావిస్తున్నారు. అయితే నిజంగా ధరలలో మార్పు జరుగుతుందా లేదా అన్నది డిసెంబర్ 1 ఉదయం వరకు మాత్రమే తేలనుంది. అంతేకాకుండా, సి‌ఎన్‌జి అండ్ పి‌ఎన్‌జి ధరలలో మార్పును కూడా ప్రకటించవచ్చు.

ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా
డిసెంబర్ నెల నుండి ఏ‌టి‌ఎం నుండి డబ్బు విత్‌డ్రా చేసే విధానం కూడా మారవచ్చు. ప్రస్తుతం మనం ఏటీఎంల నుంచి నగదు తీసుకునే పద్ధతిలో చాలాసార్లు మోసం జరిగే అవకాశం ఉంది. సమాచారం ప్రకారం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిసెంబర్ నెలలో ATMల నుండి నగదు విత్ డ్రా ప్రక్రియలో మార్పులు చేయవచ్చు. డిసెంబరు 1వ తేదీ నుంచి మీరు ఏటీఎంలో కార్డు పెట్టగానే మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ జనరేట్ అవుతుందని చెప్పారు. ATM స్క్రీన్‌పై అందించిన కాలమ్‌లో ఈ OTPని ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే క్యాష్ విత్ డ్రా చేయబడుతుంది.

రైలు షెడ్యూల్ 

డిసెంబర్ నెలలో ఇండియాలోని చాలా ప్రాంతాలలో చలి పెరుగుతుంది. చలికాలంలో పొగమంచు కూడా పెరగడం ప్రారంభమవుతుంది. దీంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడనుంది. దీంతో పలు రైళ్లను రద్దు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. పొగమంచు దృష్ట్యా రైల్వే  టైమ్ టేబుల్‌ను కూడా మార్చింది. ఈసారి కూడా రైల్వే డిసెంబర్ నెలలో రైల్వే టైమ్ టేబుల్‌ను సవరించి కొత్త టైమ్ టేబుల్ ప్రకారం రైళ్లను నడపాలని భావిస్తున్నారు.

పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్
లైఫ్ సర్టిఫికేట్ అంటే పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ 30 నవంబర్ 2022.  అంటే ఈ నెలాఖరులోగా లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయకపోతే డిసెంబర్ 1 నుంచి వారికి అసౌకర్యం కలగవచ్చు. లైఫ్ సర్టిఫికేట్ సకాలంలో సమర్పించకపోతే వారి పెన్షన్ కూడా నిలిపివేయబడుతుంది. 

13 రోజుల పాటు 

డిసెంబర్ నెలలో మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులకు హాలిడేస్ రానున్నాయి. ఈ సెలవుల్లో రెండవ, నాల్గవ శని ఇంకా ఆదివారాలు ఉన్నాయి. ఈ నెలలో క్రిస్మస్, సంవత్సరంలో చివరి రోజు డిసెంబర్ 31, గురు గోవింద్ సింగ్ జీ బర్త్ డే కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. చాలా రాష్ట్రాల్లో స్థానిక పండుగల ఆధారంగా కూడా సెలవులు ఉన్నాయి. అయితే హాలిడేస్ రోజుల్లో కస్టమర్లు ఆన్‌లైన్ బ్యాంకింగ్  ఉపయోగించుకోవచ్చు.

click me!