రికార్డ్ స్థాయికి పడిపోతున్న క్రూడాయిల్.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేనా... నేటి ధరలు ఇవే...

Published : Nov 28, 2022, 09:22 AM ISTUpdated : Nov 28, 2022, 09:24 AM IST
రికార్డ్ స్థాయికి పడిపోతున్న క్రూడాయిల్.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేనా... నేటి ధరలు ఇవే...

సారాంశం

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర స్వల్పంగా తగ్గింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ 81.47 డాలర్లుగా, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌‌లో ఈ ధర 74.12 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది.  

నేడు పెట్రోలు-డీజిల్ ధరలు నవంబర్ 28న సోమవారం యథాతథంగా ఉన్నాయి. గత ఐదు నెలలుగా మెట్రో నగరాల్లో ఇంధన ధరలలో ఎలాంటి  మార్పు లేదు. ఇంధన ధరలను ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కార్పొరేషన్లు ప్రతిరోజూ అప్‌డేట్ చేస్తాయి.

పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం తగ్గించడంతో మే నెలలో ఇంధన ధరల్లో చివరిగా హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర స్వల్పంగా తగ్గింది. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో బ్యారెల్ 81.47 డాలర్లుగా, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్‌‌లో ఈ ధర 74.12 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది.

నేటి పెట్రోలు, డీజిల్ ధరలు
 బెంగళూరు: పెట్రోల్ ధర లీటరుకు రూ. 101.94, డీజిల్ లీటరుకు రూ. 87.89
లక్నో: పెట్రోల్ ధర రూ.96.57 లీటరుకు, డీజిల్ ధర రూ. 89.76
నోయిడా: పెట్రోలు ధర లీటరుకు రూ. 96.79, డీజిల్  ధర లీటరుకు రూ. 89.96 
గురుగ్రామ్: పెట్రోల్ ధర లీటరుకు రూ. 97.18, డీజిల్ ధర లీటరుకు రూ. 90.05,
చండీగఢ్: పెట్రోలు ధర రూ. 96.20, డీజిల్ ధర లీటరుకురూ.84.26
 ముంబై: పెట్రోలు ధర లీటరుకు రూ.106.31, డీజిల్ ధర లీటరుకు 94.27
ఢిల్లీ: పెట్రోల్ ధర లీటరుకు రూ.96.72, డీజిల్ ధర లీటరుకు రూ.89.62 
చెన్నై: పెట్రోలు ధర లీటరుకు రూ.102.63, డీజిల్ ధర రూ.94.24
కోల్‌కతా: పెట్రోల్ ధర లీటరుకు రూ. 106.03, డీజిల్ ధర రూ. 92.76
హైదరాబాద్ లో నేడు లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర లీటరుకు రూ.97.82.

పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాలవారీగా మారుతుంటాయి. అలాగే విలువ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు, ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా రోజువారీ ధరలను సమీక్షించి సవరిస్తాయి.

PREV
click me!

Recommended Stories

New Labour Codes : కొత్త లేబర్ కోడ్స్ తో మీ జీతం తగ్గుతుందా? కేంద్రం చెప్పిందేంటో తెలుసా!
Post office: నెల‌కు రూ. 5 వేలు ప‌క్క‌న పెడితే.. రూ. 8.5 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు