మనం చేసే వృత్తి అలాగే మన లక్ష్యం రెండు ఒకటైనప్పుడు అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదని చెప్పాలి మీరు ఎంపిక చేసుకున్న రంగంలో అద్భుతమైన విజయం సాధించడం అనేది చాలా కొద్దిమందిలోనే జరుగుతుంది అలా ఇద్దరు సోదరులు పర్యావరణాన్ని కాపాడుదాం అని, చూయింగ్ గం లాంటి పదార్థాలను యువతకు దూరం చేసి దానికి ప్రత్యామ్నాయం అందించాలని ప్రయత్నం చేశారు వారి ప్రయత్నం ఎంత మేర సఫలం అయిందో ఇప్పుడు తెలుసుకుందాం.
టైం పాస్ చేయడానికి చూయింగ్ గమ్ నమలడం యువతలో ఎక్కవగా చూస్తుంటాం. మనలో చాలా మందికి ఉండే అలవాట్లలో చూయింగ్ గమ్ ఒకటి. కానీ ఇది చాలా హానికరమైనది అన్న సంగతి కొద్ది మందికే తెలుసు. ఆరోగ్యానికే కాదు చూయింగ్ గమ్ మన పర్యావరణానికి కూడా చేటు చేస్తుంది.చూయింగ్ గమ్‌లు నాన్-బయోడిగ్రేడబుల్ పాలిమర్‌లు, కృత్రిమ స్వీటెనర్‌లు,ఫ్లేవర్‌లతో తయారు చేస్తారు, ఇవి ఆరోగ్య సమస్యలను సృష్టిస్తాయి. అయితే బెంగుళూరుకు చెందిన ఇద్దరు సోదరులు మయాంక్ నగోరి, భువన్ నగోరి చూయింగ్ గమ్ కు ప్రత్యామ్నాయం కనుగొన్నారు. వారు గుడ్ గమ్ పేరిట ప్లాస్టిక్ రహిత, బయోడిగ్రేడబుల్, శాకాహార చూయింగ్ గమ్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు.
NSRCEL - IIMB ద్వారా ప్రోత్సాహం పొందిన ఈ గుడ్ గమ్. చూయింగ్ గమ్ ప్లేసును భర్తీ చేస్తోంది. తద్వారా భూమిని కలుషితం చేయకుండా 750 - 800 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఆదా చేసింది. ఇప్పటి వరకు వీరిద్దరూ దాదాపు 12,000 మంది వినియోగదారులకు సేవలు అందించారు. ఇక ఈ నేచురల్ చూయింగ్ గమ్ తయారీకి ముందు మయాంక్ , భువన్ జీవితాలలో వారి చిన్నతనం నుండి వ్యాపారం చేయాలనే ఆలోచన ఉంది. ఈ సోదరులిద్దరూ ప్రకృతి , కాలుష్యం గురించి ఎప్పుడు ఆలోచించే వారు. ఆ సమయంలోనే మయాంక్ చూయింగ్ గమ్ , ప్లాస్టిక్ కనెక్షన్ గురించి తెలుసుకొని షాక్ కు గురయ్యాడు. లైఫ్ బియాండ్ నంబర్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, మయాంక్ ఇలా అన్నారు, "నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు, చూయింగ్ గమ్‌లు ప్లాస్టిక్‌తో తయారవుతాయని, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల కంటే ఇవి భూమిలో కలిసిపోవడానికి ఎక్కువ సమయం పడుతుందని మా జాగ్రఫీ టీచర్ నాకు చెప్పారు. అప్పుడే తాను చూయింగ్ గమ్ కు ప్రత్యామ్నాయం ప్రయత్నించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అంతేకాదు తన సోదరుడు భువన్ సైతం ఇదే లక్ష్యంగా పనిచేయడం విశేషం.
కొన్ని సంవత్సరాల తరువాత, లండన్‌లోని నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయంలో ఫుడ్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ కోసం చదువుతున్నప్పుడు, మయాంక్ చూయింగ్ గమ్ కాలుష్య సమస్యను గుర్తించాడు. యుఎస్‌లోని ఒక కంపెనీ ఆరోగ్యకరమైన చూయింగ్ గమ్‌ను తయారు చేయడం చూసినప్పుడు, భారతదేశంలో కూడా ఇలాంటి చూయింగ్ గమ్ తయారు చేయాలని మయాంక్ నిర్ణయం తీసుకున్నారు.
సాంప్రదాయ చూయింగ్ గమ్‌ను పాలీ వినైల్ అసిటేట్ అనే రసాయనం నుండి తయారు చేస్తారు, దీనిని రబ్బరు టైర్లు , గమ్‌లలో కూడా ఉపయోగిస్తారు , చూయింగ్ గమ్‌కు రంగు , రుచిని అందించడానికి వివిధ కృత్రిమ పదార్థాలను జోడించారు. ఈ కృత్రిమ స్వీటెనర్లు దీర్ఘకాలంలో శరీరానికి హాని కలిగిస్తాయి. దీంతో పోల్చి తాము తయారు చేసే గుడ్ గమ్ చెట్ల నుంచి తయారవుతుందని మయాంక్ పేర్కొన్నాడు. ఇందులో జిలిటోల్ , స్టెవియా వంటి సహజ స్వీటెనర్లు వాడినట్లు పేర్కొన్నారు. అందువల్ల ఒక గమ్ కేవలం ఒక క్యాలరీ శక్తి మాత్రమే ఉంటుందని పేర్కొన్నాడు.
అంతేకాదు మార్కెట్లోకి విడుదలచేసి మంచి సక్సెస్ కూడా సాధించాలి మయాన్ సృష్టించిన ఈ గుడ్ గమ్ ప్రస్తుతం వేగంగానే విస్తరిస్తోంది ప్రకృతి పట్ల భూమి పర్యావరణం పట్ల తమకు ఉన్న ప్రేమే ఈ ఉత్పత్తి తయారు చేయడానికి ప్రేరేపించింది అని ఈ సోదరులు ఇద్దరు చెబుతున్నారు అంతేకాదు తమ సంకల్పం మంచి ఆదాయ మార్గం కూడా చూపించిందనిజ ఈ సోదరుడు చెబుతున్నారు.