మరోసారి క్రూడాయిల్ భారీ పతనం.. పెట్రోల్ పై 35 పైసలు.. డీజిల్ పై 4 పైసలు తగ్గింపు..

By asianet news teluguFirst Published Sep 16, 2022, 8:49 AM IST
Highlights

ముడి చమురు గురించి మాట్లాడినట్లయితే ధరలు గత 24 గంటల్లో బాగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర గత 24 గంటల్లో బ్యారెల్‌కు సుమారుగా నాలుగు డాలర్లు తగ్గి 90.73 డాలర్లకు చేరుకోగా, డబ్ల్యూటీఐ ధర కూడా బ్యారెల్‌కు 4 డాలర్లు తగ్గి 84.97 డాలర్లకు చేరుకుంది.

న్యూఢిల్లీ: గత 24 గంటల్లో గ్లోబల్ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరల్లో భారీ పతనం ఏర్పడింది. దీంతో దేశీయ రిటైల్ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభావితం చేసింది.

ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు తాజాగా విడుదల చేసిన ధరల ప్రకారం ఢిల్లీ, ముంబై సహా దేశంలోని నాలుగు మహానగరాల్లో నేటికీ చమురు ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే యూపీలోని పలు నగరాల్లో ఇంధన ధరలు మారాయి. ఈరోజు నోయిడా-గ్రేటర్ నోయిడాలో పెట్రోల్ ధర 4 పైసలు పెరిగి రూ.96.69కి చేరగా, డీజిల్ 4 పైసలు పెరిగి రూ.89.86కి చేరుకుంది. ఘజియాబాద్‌లో లీటర్ పెట్రోల్ 35 పైసలు తగ్గి రూ.96.23కి, డీజిల్ 33 పైసలు తగ్గి రూ.89.42కి చేరుకుంది. లక్నోలో లీటర్ పెట్రోల్ 21 పైసలు తగ్గి రూ.96.36కి, డీజిల్ 20 పైసలు తగ్గి రూ.89.56కి చేరుకుంది.

ముడి చమురు గురించి మాట్లాడినట్లయితే ధరలు గత 24 గంటల్లో బాగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర గత 24 గంటల్లో బ్యారెల్‌కు సుమారుగా నాలుగు డాలర్లు తగ్గి 90.73 డాలర్లకు చేరుకోగా, డబ్ల్యూటీఐ ధర కూడా బ్యారెల్‌కు 4 డాలర్లు తగ్గి 84.97 డాలర్లకు చేరుకుంది.

మెట్రో నగరాల్లో నేడు పెట్రోల్-డీజిల్ ధరలు
- ఢిల్లీలో పెట్రోల్ రూ. 96.72, డీజిల్ లీటరుకు రూ. 89.62
 - ముంబైలో పెట్రోల్ రూ. 106.31, డీజిల్ రూ. 94.27 
- చెన్నైలో పెట్రోల్ రూ. 102.63, డీజిల్ రూ . 94.24
- కోల్‌కతాలో పెట్రోల్  రూ. 106.03, డీజిల్ లీటరుకు రూ. 92.76
- పాట్నాలో లీటర్ పెట్రోల్ రూ.107.24, డీజిల్ రూ.94.04గా ఉంది.
–పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ రూ.84.10, డీజిల్ రూ.79.74గా ఉంది.
-హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.109.66, డీజిల్‌ ధర రూ.97.82

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్ - డీజిల్ ధరలలో సవరణ ఉంటుంది. కొత్త ధరలు ఉదయం 6 గంటల నుంచి వర్తిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్  ఇతర  జోడించిన తర్వాత దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా కనిపించడానికి ఇదే కారణం.

ఈ విధంగా పెట్రోల్ -డీజిల్ ధరలను తెలుసుకోవచ్చు
ఇండియన్ ఆయిల్ కస్టమర్లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249 నంబర్‌కు, BPCL కస్టమర్‌లు RSP ఇంకా వారి సిటీ కోడ్‌ను 9223112222 నంబర్‌కు, HPCL కస్టమర్‌లు HPPrice సిటీ కోడ్‌ని టైప్ చేసి 9222201122 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్ పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.

click me!